(Namrata) సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వాటి పాట’ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ ప్రస్తుతం స్పెయిన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబును గతంలో ఎన్నడూ చూడని విధంగా చూపేందుకు దర్శకుడు పరశురాం పెట్ల తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మరో రెండు షెడ్యూల్లు హైదరాబాద్, దుబాయ్‌లో చిత్రీకరించారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 13 న విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ సింహాచలం టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందని, విలన్ సముద్రకనికి సూపర్‌స్టార్ నరసింహ దేవుడుగా కనిపిస్తారని సినిమా వర్గాలు చెప్తున్నాయి.
మహేశ్ బాబు సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. ఆయన భార్య నమ్రత శిరోద్కర్ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నదంట. తన ఇద్దరు పిల్లలు గౌతం, సితారను తీసుకుని మహేశ్‌తో కలిసి స్పెయిన్ వెళ్లిన నమ్రత.. అక్కడ హాలీడే ట్రిప్‌లో గడుపుతున్నది. స్పెయిన్‌లో తన హాలీడే మూవ్‌మెంట్స్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా నమ్రత తన అభిమానులతో పంచుకున్నారు. ‘మరో చిరస్మరణీయ సెలవుదినం! స్పెయిన్‌కు వచ్చాం’ అనే కాప్షన్ ఫొటోపైన నమ్రత రాశారు. ‘ఇక్కడి సరస్సు వద్ద తాజా గాలి… చాలా కాలం తర్వాత శ్వాస తీసుకుంటున్నట్లు అనిపిస్తున్నది. ఈ మధుర క్షణాలను అనుభవిస్తున్నాను. ప్రపంచంలో నాకు ఇష్టమైన ప్రదేశంలో మళ్లీ జీవిస్తున్నాను’ అని ఫొటోకు నమ్రత కాప్షన్ ఇచ్చారు.
గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
అమెరికాలో పైప్‌లైన్ లీక్.. సముద్రంలో భారీగా చమురు తెట్టు
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్‌కతాలో కొత్త సంప్రదాయం
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
అభివృద్ధిలో అనుసంధానత పాత్ర కీలకం : వెంకయ్యనాయుడు
70 శాతం వయోజనులకు అందిన తొలి డోసు : మాండవీయ
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..