Mothers for Mother godess : అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్కతాలో కొత్త సంప్రదాయం
Mothers for Mother godess : అమ్మలగన్న అమ్మకు పూజలు చేసేందుకు అమ్మలే పూనుకుంటే అది విశిష్టమైనదే కదా! ఈ నవరాత్రి సందర్భంగా కోల్కతా చరిత్రలో తొలిసారిగా...

కోల్కతా : (Mothers for Mother godess) మన వద్ద మహిళా అర్చకులు చాలా తక్కువగా కనిపిస్తుంటారు. ఎవరైనా పెండ్లి చేస్తూ కనిపించారో.. పెండ్లిని వదిలేసి వారు ఎలా తంతు జరిపిస్తున్నారని గమనిస్తూ ఉంటారు. వాళ్లను ప్రోత్సహించరు. వారికి సంఘంలో తగిన గౌరవమర్యాదలు ఇవ్వరు. అలాంటిది అమ్మలగన్న అమ్మకు పూజలు చేసేందుకు అమ్మలే పూనుకుంటే అది విశిష్టమైనదే కదా! ఈ నవరాత్రి సందర్భంగా కోల్కతా చరిత్రలో తొలిసారిగా మహిళా పూజారులతో అమ్మ నిత్య పూజలు, నైవేద్యాలు అందుకోనున్నది.
ఈ నవరాత్రిలో కోల్కతాలో కొత్త ఉదాహరణ మన ముంగిట నిలువనున్నది. కోల్కతా చరిత్రలో తొలిసారిగా నలుగురు మహిళా పూజారులచే దుర్గా మాత పూజలందుకోనున్నది. దక్షిణ కోల్కతా క్లబ్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కుంతి పూజ (పండల్ తయారీ ప్రారంభ పూజ) నుంచి విజయ దశమి వరకు ఒక మహిళా పూజారితో పూజాధికాలు నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా నలుగురు మహిళా పూజారు బృందంతో కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తుండటం విశేషం.
ఈసారి ఈ క్లబ్ ఆరాధన థీమ్ ‘అమ్మలచే అమ్మవారిని పూజించడం’. రవీంద్ర సంగీతం, రజినీకాంత, ద్విజేంద్ర గీత్ వంటి విభిన్న శైలుల పాటలు పూజా మంత్రాలతో ఈసారి పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. మహిళా పూజారులైన డాక్టర్ నందిని భౌమిక్, రుమా రాయ్, సేమంతి బెనర్జీ, పౌలోమి చక్రవర్తి.. గత దశాబ్దకాలంగా నగరంలో వివాహాలు, గృహ ప్రవేశం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే వారు పూజారులుగా విగ్రహారాధన చేయడం ఇదే మొదటిసారి. ఆధునిక తరం గ్రంథాలను తగిన రీతిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నామని క్లబ్లో పూజాధికాలు నిర్వహించే 66 పల్లి పూజ కమిటీకి చెందిన ప్రద్యుమ్న ముఖర్జీ చెప్పారు. ఈ మార్పును ప్రజలు అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కళగా మార్చేందుకు పరిశోధన : నందిని భౌమిక్
అర్చకత్వాన్ని కళగా మార్చడానికి విస్తృతమైన పరిశోధన చేస్తున్నట్లు డాక్టర్ నందిని భౌమిక్ చెప్పారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ఆరాధన ఆచారాల్లో పాల్గొనడానికి బదులుగా ఇతర కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇష్టపడతారని గుర్తించామని తెలిపారు. అలాంటి వ్యక్తులను ఆసక్తితో ఆరాధన పనిలో నిమగ్నం చేయడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
అభివృద్ధిలో అనుసంధానత పాత్ర కీలకం : వెంకయ్యనాయుడు
70 శాతం వయోజనులకు అందిన తొలి డోసు : మాండవీయ
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

