Guinness records : గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
Guinness records : జెఫ్ బెజోస్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ‘బ్లూ ఆరిజిన్’ గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాకుండా ఏకంగా నాలుగు రికార్డులను తన పేరిట...

(Guinness records) జెఫ్ బెజోస్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ‘బ్లూ ఆరిజిన్’ గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాకుండా ఏకంగా నాలుగు రికార్డులను తన పేరిట రాసుకున్నది. అంతరిక్ష రేసులో ప్రయోజనం పొందేందుకు బ్లూ ఆరిజిన్ భద్రతా సమస్యలను విస్మరించిందనే వాదనల మధ్య.. ఈ రాకెట్ ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.
మొదటి బృంద మిషన్ విజయవంతంగా ప్రారంభించి, ల్యాండింగ్ అయిన కొన్ని నెలల తర్వాత జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజన్’ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరును నమోదు చేసుకున్నది. అంతరిక్షంలోకి బాస్ జెఫ్ బెజోస్‌ని తీసుకెళ్లిన ఈ విమానం నాలుగు ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఈ అంతరిక్ష ప్రయాణం.. అభివృద్ధి చెందుతున్న స్పేస్ టూరిజం రంగాన్ని బలోపేతం చేసిందని చెప్పవచ్చు. కార్మెన్ లైన్ పైన (భూమికి 100 కి.మీ.) పైన అంతరిక్ష నౌకలో నలుగురు ప్రయాణికులు వెళ్లి భూమికి తిరిగి రావడానికి.. వారు 3 నిమిషాల పాటు ప్రయాణించారు.
అంతరిక్షంలోకి వెళ్లిన పెద్ద వయసు గల వ్యక్తి (వాలీ ఫంక్-82), అంతరిక్షానికి వెళ్లిన పిన్న వయస్కుడు (ఆలివర్ డేమన్-19), అంతరిక్షానికి వెళ్లిన మొదటి తోబుట్టువులు (జెఫ్ బెజోస్, మార్క్ బెజోస్), చెల్లింపు వినియోగదారులను తీసుకువెళ్లిన మొదటి సబార్బిటల్ అంతరిక్ష నౌక (న్యూ షెఫర్డ్).. వంటి నాలుగు ప్రపంచ రికార్డులను ఈ రాకెట్ సృష్టించింది. బ్లూ ఆరిజిన్ తన తదుపరి మిషన్ ప్రయాణం అక్టోబర్ 12 న జరుగనున్నట్లు ప్రకటించింది. ఇది భూమి మించి నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి. తిరిగి తీసుకురానున్నది.
ఇవి కూడా చదవండి..
అభివృద్ధిలో అనుసంధానత పాత్ర కీలకం : వెంకయ్యనాయుడు
70 శాతం వయోజనులకు అందిన తొలి డోసు : మాండవీయ
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

