Obesity : ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
Obesity : ఊబకాయం ప్రస్తుత తరాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య. అమెరికా, చైనా దేశాలు ఊబకాయంలో మొదటి, రెండు స్థానాల్లో ఉండగా.. మన దేశం మూడో స్థానంలో...

(Obesity) ఊబకాయం ప్రస్తుత తరాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య. అమెరికా, చైనా దేశాలు ఊబకాయంలో మొదటి, రెండు స్థానాల్లో ఉండగా.. మన దేశం మూడో స్థానంలో నిలిచింది. జీవనశైలిలో మార్పులు, వ్యాయామానికి దూరంగా ఉండటం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఊబకాయం వస్తుందని నిపుణులు చెప్తుంటారు. ఊబకాయులైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకి 80 శాతం ఊబకాయం వస్తుంది. అలాగే తల్లిదండ్రులలో ఏ ఒక్కరికైనా ఈ సమస్య ఉన్నట్లయితే 50 శాతం వరకు వారి పిల్లలకు ఊబకాయం వచ్చే అవకాశం ఉన్నట్లుగా గత పరిశోధనలు వెల్లడించాయి. అయితే, స్థూలకాయం పెరగడానికి గల మరో ముఖ్య కారణాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మానవ శరీరంలోని 14 రకాల జన్యువుల కారణంగా మనలో ఊబకాయం వస్తుందని వర్జీనియా విశ్వవిద్యాలయంలోని కాలేజీ ఆఫ్ ఆర్ట్ ఆండ్ సైన్స్ పరిశోధకులు సెలవిస్తున్నారు.
ఈ 14 రకాల జన్యువుల కారణంగా మానవులు గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులతో పోరాడుతున్నారు. ఊబకాయం కూడా ఒక అంటువ్యాధి అని వర్జీనియా విశ్వవిద్యాలయం పరిశోధకులు అంటున్నారు. అధిక క్యాలరీల ఆహారం, అధిక మొత్తంలో చక్కెర, ఫ్రక్టోజ్ తీసుకున్నప్పుడు స్థూలకాయం పెరుగుతుంది. అయితే, మానవ జన్యువులు కూడా ఊబకాయం రావడానికి కారణమని వీరి పరిశోధన స్పష్టం చేస్తున్నది. ఇటువంటి జన్యువులను నియంత్రించడం ద్వారా ఊబకాయం తగ్గుతుందని వారంటున్నారు. పరిశోధనల ప్రకారం, మానవులు తీసుకున్న అదనపు ఆహారాన్ని కొవ్వుగా మార్చే పనిని ఏ జన్యువులు చేస్తున్నాయో తెలుసుకున్న తర్వాత, ఈ జన్యువును ఔషధాల ద్వారా పనిచేయకుండా చేయవచ్చు. ఈ విధంగా ఊబకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మధుమేహం వంటి అనేక వ్యాధులను కూడా నివారించవచ్చు.
క్రిమిలో మానవుడి జన్యువులు..
మానువుడిలో మాదిరిగా జన్యువులు కలిగివున్న ఓ క్రిమిపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని పరిశోధక బృందంలోని సభ్యురాలు ఎలిన్ ఓ రూర్కె తెలిపారు. ఈ కీటకం నిజానికి వెజిటేరియన్ అని, దీనిలో మనుషుల్లో మాదిరి 70 శాతం జీన్స్ లభించాయని పేర్కొన్నారు. ఇవి కూడా మనుషుల మాదిరిగా చక్కెరలను ఎక్కువగా తినడం వల్ల ఊబకాయానికి చేరువైనట్లు గుర్తించినట్లు వెల్లడించారు. కీటకాల సహాయంతో స్థూలకాయానికి సంబంధించిన 293 జన్యువులను మానవుల్లో కూడా కనుగొన్నారు. వీటిలో 14 స్పష్టంగా ఊబకాయం పెంచే జన్యువులు కాగా, పెరుగుతున్న బరువును నియంత్రించడంలో 3 జన్యువులు సహాయపడతాయి. ఈ పరిశోధన ఫలితాలతో రానున్న రోజుల్లో ఊబకాయం సమస్యను పరిష్కరించేందుకు ఔషధాలను తీసుకొచ్చేందుకు మందుల తయారీ కంపెనీలకు అవకాశం లభించనున్నది.
ఇవి కూడా చదవండి..
భారత్‌లో 20 లక్షల వాట్సాప్ ఖాతాలు మూసివేత
ఈశాన్యంలో పర్యటిస్తున్న వెంకయ్యనాయుడు
తైవాన్‌లోకి మళ్లీ చొరబడిన చైనా విమానాలు
రాజస్థాన్‌లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

