Rajastan Farmers : రాజస్థాన్‌లో సాగునీటి కోసం రైతుల ఆందోళన
Rajastan Farmers : రాజస్థాన్‌లో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నది. రైతు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచిన ఘడ్సానాలో రైతులు మరోసారి ...

జైపూర్ : (Rajastan Farmers) రాజస్థాన్‌లో రైతుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నది. రైతు ఉద్యమాలకు మారుపేరుగా నిలిచిన ఘడ్సానాలో రైతులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచి 10 వేల మందికి పైగా రైతులు ఎస్డీఎం కార్యాలయాన్ని చుట్టుముట్టారు. డీఎస్పీతో పాటు 150 మంది పోలీసులను బందీలుగా తీసుకున్నారు. రాత్రి పూట వ్యూహాత్మకంగా రైతులు అక్కడే లాంగర్ ఏర్పాటుచేశారు.
శ్రీ గంగానగర్‌లోని ఘడ్సానాలోని కాలువ నీటి కోసం నిప్పు రాజుకుంది. శనివారం అర్థరాత్రి వేలాది మంది రైతులు డీఎస్పీ జయదేవ్ సిహాగ్ సహా 150 మంది పోలీసులను బందీలుగా చేసుకున్నారు. ఉదయం కూడా వారిని బయటకు రానివ్వలేదు. ఉద్రిక్తత నేపథ్యంలో ఘడ్సానాలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో రైతుల ఉద్యమానికి భిన్నంగా.. రాజస్థాన్‌లోని గెహ్లాట్ ప్రభుత్వం ఇక్కడి రైతులను లక్ష్యంగా చేసుకుంటున్నది.
రైతులు పొలం వదిలి సాగునీటి కోసం డిమాండ్ చేస్తున్నారు. తమ పొలాలకు సాగునీరు ఇవ్వకపోతే వేలాది ఎకరాల పంట నాశనమవుతుందని రైతులు భయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరూ చర్చలకు పిలువనందున రైతుల ఆందోళన ప్రారంభమైంది. ఇప్పుడు 10 వేల మందికి పైగా రైతులు సమావేశమయ్యారు. ఈ సంఖ్య మెల్లమెల్లగా పెరుగుతున్నది. రైతులు వ్యూహం ప్రకారమే ఆందోళన చేస్తున్న ప్రాంతంలోనే లాంగర్ ఏర్పాటు చేశారు. బందీలుగా చేసుకున్న అధికారులకు కావాల్సిన ఆహారం, మందులు అందిస్తామని, తమ డిమాండ్లు నెరవేరేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు కరాఖండిగా చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
ఈ అమ్మడు ఆనందం చూశారా? ఏటీఎంలో యువతి డ్యాన్స్ వైరల్
గాంధీ జయంతి రోజున ‘గాడ్సే’ సినిమా ప్రకటన
బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
చైనా సైన్యంలో పాక్ అధికారుల రహస్య మోహరింపు.. ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

