Indira Gandhi : జీపుల కొనుగోలు కేసులో ఇందిరా గాంధీ అరెస్ట్
Indira Gandhi : భారతదేశం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1977 లో సరిగ్గా ఇదే రోజున అరెస్టయ్యారు. ఎన్నికల ప్రచారం చేసేందుకు...

(Indira Gandhi) భారతదేశం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1977 లో సరిగ్గా ఇదే రోజున అరెస్టయ్యారు. ఎన్నికల ప్రచారం చేసేందుకు జీపుల కొనుగోలులో అవినీతి ఆరోపణలను ఇందిరా గాంధీ ఎదుర్కొన్నారు. 1977 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాయ్‌బరేలీలో ఇందిరా గాంధీ కోసం 100 జీపులు కొనుగోలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి. 100 జీపులను కొనుగోలు చేసేందుకు నయా పైసా కూడా కాంగ్రెస్ చెల్లించలేదు. అయితే, బడా పారిశ్రామికవేత్తలు వీటి మొత్తాన్ని చెల్లించినట్లు, ప్రభుత్వ డబ్బు కూడా ఉపయోగించినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.
ఎమర్జెన్సీ సమయంలో ప్రత్యర్థులను ఇందిరాగాంధీ వేధించిన తీరుపై చాలా మంది నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. తమను జైలుకు పంపినట్లుగానే ఇందిరను పట్ల కూడా వ్యవహరించాలని చాలా మంది కోరుకున్నారు. హోంమంత్రిగా ఉన్న చౌదరి చరణ్ సింగ్ పట్టుదలగా ఉండగా.. ప్రధాని మొరార్జీ దేశాయ్ దీనికి ఇష్టపడలేదు. ఆ తర్వాత, అక్టోబర్ 3 న సీబీఐ ఇందిరాగాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెను అరెస్టు చేసింది. అనంతరం ఆమెను బద్కల్ లేక్ గెస్ట్ హౌస్‌లో నిర్బంధించారు. అక్కడి నుంచి పోలీసు లైన్స్ ఆఫ్ కింగ్స్‌వే క్యాంప్‌లో ఆఫీసర్స్ మెస్‌లో ఉంచారు. అక్టోబర్ 4 ఉదయం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చినప్పుడు, ఇందిరపై ఎలాంటి ఆధారాలు లేవన్న విషయం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత సాంకేతిక కారణాలతో ఆమెను నిర్దోషిగా విడుదల చేశారు.
జనతా పార్టీ చేసిన ఈ రాజకీయ తప్పిదాన్ని ‘ఆపరేషన్ బ్లండర్’గా అభివర్ణిస్తుంటారు. అరెస్టుతో ఇందిరా గాంధీ ఏమాత్రం బాధపడలేదు. జనతా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య కారణంగా ఎమర్జెన్సీ విషయంలో ఇందిరపై ప్రజల్లో ఉన్న కోపం కాస్తా సానుభూతిగా మారింది. దాని ప్రభావం 1980 ఎన్నికల్లో కనిపించి ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2013 : దాణా కుంభకోణంలో లాలాప్రసాద్ యాదవ్‌కు ఐదేండ్ల జైలుశిక్ష విధింపు
2003 : హతాఫ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్
1999 : వాజపేయి నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్
1996 : 37 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించిన షాహిద్ ఆఫ్రిదీ
1984 : భారత్‌లో అతిపొడవైన రైలు మార్గం జమ్ము తావి నుంచి కన్యాకుమారికి ప్రారంభం
1978 : భారతదేశంలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ కోల్‌కతాలో జననం
1952 : ఆపరేషన్ హరికెన్ పేరిట అణు బాంబు పరీక్షలు జరిపిన బ్రిటన్
1863 : ఫార్మల్గా ప్రారంభమైన థ్యాంక్స్ గివింగ్ డే
ఇవి కూడా చదవండి..
ఈ అమ్మడు ఆనందం చూశారా? ఏటీఎంలో యువతి డ్యాన్స్ వైరల్
గాంధీ జయంతి రోజున ‘గాడ్సే’ సినిమా ప్రకటన
బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
చైనా సైన్యంలో పాక్ అధికారుల రహస్య మోహరింపు.. ఎందుకంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

