Godse Movie : గాంధీ జయంతి రోజున ‘గాడ్సే’ సినిమా ప్రకటన
Godse Movie : మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా ‘గాడ్సే’ సినిమా ప్రకటన వెలువడింది. ఈ ప్రత్యేకమైన రోజున ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు దర్శకుడు...

ముంబై : (Godse Movie) మహాత్మాగాంధీ 152 వ జయంతి సందర్భంగా ‘గాడ్సే’ సినిమా ప్రకటన వెలువడింది. ఈ ప్రత్యేకమైన రోజున ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ప్రకటించారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ‘గాడ్సే’ సినిమా టీజర్‌ను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా మహేష్ మంజ్రేకర్ పంచుకుని సినిమా పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు.
మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘గాడ్సే’ సినిమాకు సందీప్ సింగ్, రాజ్ శాండిల్యా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తమ రాబోయే చిత్రం ‘గాడ్సే’ కోసం మహేష్ మంజ్రేకర్ మరియు రాజ్ శాండిల్యాతో చేతులు కలుపుతున్నట్లు సందీప్ సింగ్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మాణ సంస్థ లెజెండ్ గ్లోబల్ స్టూడియో, రాజ్ శాండిల్య నిర్మాణ సంస్థ థింక్‌ఇంక్ పిక్చరెజ్ నిర్మిస్తున్నాయి. లెజెండ్ గ్లోబల్ స్టూడియో కోసం మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న మూడో సినిమా ఇది. దీని కన్నా ముందు ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ , ‘వైట్’ సినిమాలకు పనిచేశాడు.
‘నాథూరామ్ గాడ్సే కథ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ తరహా సినిమా ప్రాజెక్ట్‌కు దర్శకత్వం చేయడానికి చాలా ధైర్యం కావాలి. నేను ఎప్పుడూ కష్టపడే సబ్జెక్ట్‌లు, రాజీపడని కథా కథనాలను నమ్ముకుంటాను. గాంధీపై గాడ్సే కాల్పులు జరిపిన వ్యక్తిగా మినహాయిస్తే, ఆయన గురించి ప్రజలకు పెద్దగా ఏమీ తెలియదు. అతడి కథను చెప్తున్నప్పుడు ఆయనను ఒక పాత్రగానే చూస్తాం కానీ, ఎవరికీ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడం. ఎవరు సరైనవారు, ఎవరు కాదు అనేది ప్రేక్షకులకే వదిలివేస్తాం’ అని మహేష్ మంజ్రేకర్ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పదవి ఉన్నా లేకున్నా రాహుల్, ప్రియాంక వెంటే : సిద్ధూ
బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
చైనా సైన్యంలో పాక్ అధికారుల రహస్య మోహరింపు.. ఎందుకంటే?
ఖట్టర్ నివాసం వద్ద రైతుల ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు
తాలిబాన్ అణిచివేతకు అమెరికా బిల్లు.. లక్ష్యం మాత్రం పాకిస్తాన్!?
హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం
ఈ గడ్డపై పుట్టిన ఈ ఇద్దరు మహనీయులు అమరులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

