హైదరాబాద్‌లో మివీ ప్లాంట్
రంగారెడ్డి జిల్లా తుకుగూడలోని ఈ-సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఆవిషరణ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మివీ నూతన తయారీ ప్లాంట్‌ను నెలకొల్పింది.
- రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన సంస్థ
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా తుకుగూడలోని ఈ-సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఆవిషరణ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మివీ నూతన తయారీ ప్లాంట్‌ను నెలకొల్పింది. శనివారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని దేశంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.
ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు, హార్డ్‌వేర్ పారులను మరింత బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. చిప్ డిజైన్, సెమీకండక్టర్ తయారీ, ఎలక్ట్రానిక్ విడిభాగాల ఉత్పత్తిలోనూ తెలంగాణను ముందంజలో నిలపాలన్నదే తమ లక్ష్యమని, ఇందుకోసం రీసెర్చ్, ప్రొడక్ట్ డిజైన్ నుంచి విడి భాగాలు, ఎండ్ ప్రొడక్ట్స్ తయారీ వరకు అన్ని కార్యకలాపాలు రాష్ట్రంలోనే జరిగేలా కంపెనీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. స్థానిక పరిశ్రమలను గ్లోబల్ సపె్లై చైన్ తో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

