Navy Personnel : హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం
Navy Personnel : ఉత్తరాఖండ్‌లోని చమోలి ప్రాంతంలో హిమపాతం సంభవించింది. త్రిశూల్ పర్వతం అధిరోహించేందుకు వచ్చిన నేవీ బృందంలోని...

డెహ్రాడూన్ : (Navy Personnel) ఉత్తరాఖండ్‌లోని చమోలి ప్రాంతంలో హిమపాతం సంభవించింది. త్రిశూల్ పర్వతం అధిరోహించేందుకు వచ్చిన నేవీ బృందంలోని ఆరుగురు కనిపించకుండా పోయినట్లు సమాచారం. వారిని గుర్తించేందుకు రిలీఫ్-రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. వీరికి తోడుగా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలిలో శుక్రవారం భారీగా హిమపాతం సంభవించింది. బాగేశ్వర్ జిల్లాలోని పశ్చిమ కుమావ్ ప్రాంతంలోని 7,120 మీటర్ల ఎత్తైన త్రిశూల్ పర్వతాన్ని అధిరోహిస్తున్న 20 మంది సభ్యులు గల నేవీ పర్వతారోహణ బృందంలోని ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఐదుగురు సిబ్బంది, తోడుగా ఉన్న కూలీని హిమపాతం చుట్టేసింది. సమాచారం అందగానే నేవీ గాలింపు చర్యలను ప్రారంభించింది. నెహ్రూ పర్వతారోహణ సంస్థ నుంచి రిలీఫ్-రెస్క్యూ టీం కూడా మౌంట్ త్రిశూల్‌కు బయల్దేరి వెళ్లింది.
ఈ 20 మంది సభ్యుల యాత్ర సెప్టెంబర్ 3 న ముంబై నుంచి ప్రారంభమైంది. వీరిలో 10 మంది పర్వతారోహకులు శిఖరాన్ని చేరుకునే చివరి దశలోకి వచ్చారు. అయితే ఆకస్మికంగా హిమపాతానికి గురవడంతో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతావారి ఆచూకీ కనుగొనేందుకు భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) ప్రయత్నిస్తున్నాయని నేవీ ప్రతినిధి తెలిపారు. ఇటీవల, హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్-స్పిటిలో ట్రెక్కింగ్ కోసం ఖామిగర్ హిమానీనదంలో 16 మంది ట్రెక్కింగ్ బృందం తప్పిపోయింది. ఇందులో 11 మంది సభ్యులు క్షేమంగా బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఈ గడ్డపై పుట్టిన ఈ ఇద్దరు మహనీయులు అమరులు
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు
అహ్మదాబాద్‌లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

