e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News Breast Cancer : మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు

Breast Cancer : మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణకు చిట్కాలు

(Breast Cancer) రొమ్ము కాన్సర్ అనేది రొమ్ము కణజాలాల నుంచి వచ్చే కాన్సర్. సాధారణంగా ఇది పాలు ఉత్పత్తి చేసే గ్రంథుల కణజాలం నుంచి ఆరోగ్యకరమైన రొమ్ము కణజాలంపై దాడి చేస్తుంది. కేవలం బాహ్య లక్షణాలను బట్టి రొమ్ము క్యాన్సర్‌ను నిర్ణయించలేం. భారత్‌లో మహిళలకు సోకే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ అధికంగా కనిపిస్తుంది. ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు సకాలంలో చేయకపోవటం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో అధిక శాతం మంది మహిళలు వ్యాధి బాగా ముదిరిన తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికీ ఈ సమస్య బహిరంగంగా చర్చించుకునే అంశంలా లేదు.

మహిళలు 30 ఏండ్ల వయసు దాటిన వెంటనే తరచుగా రొమ్ము క్యాన్సర్ ఆలోచనలతో బాధపడుతున్నారు. రొమ్ములో క్యాన్సర్ కణాల ఉనికి గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు. జన్యుపరమైన కారణాలు, గతంలో క్యాన్సర్‌ వచ్చి ఉన్నవారికి, రొమ్ములో గడ్డలు కనిపించినవారిలో, రుతుక్రమం చిన్న వయసులో ప్రారంభమైనా, మెనోపాజ్‌ ఆలస్యంగా వచ్చినా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ చిట్కాలు చూడండి..
శరీరం బరువు నిర్వహణ: ఆరోగ్యకరమైన బరువు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ, గుండె ఆరోగ్యానికి, ఎముక, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి డైట్ కంట్రోల్‌తోపాటు యోగా, వ్యాయామం వంటివి అలవర్చుకోవాలి.

ఆహారం ముఖ్యపాత్ర: ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం శరీరానికి ఎంతో ముఖ్యమైనదని తెలిసినప్పటికీ ప్రజలు తరచుగా వారి జీవనశైలిలో చేర్చుకోవడంలో విఫలమవుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని గుర్తించాలి. పుట్టగొడుగులు, బ్రొకోలి, దానిమ్మ, బీన్స్‌, చిక్కుడు గింజలు, బచ్చలి కూర నిత్యం ప్లేట్‌లో ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం మరువొద్దు: శారీరకంగా చురుకుగా ఉండేందుకు వివిధ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి నిత్యం అర్ధగంటకు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి: మద్యం, ధూమపానం, మాదకద్రవ్యాల వినియోగం వంటి అలవాట్ల వల్ల బ్రెస్ట్‌ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకుగాను, పరిశుభ్రమైన జీవనశైలిని పాటించడం అలవాటు చేసుకోవాలి. మన ఆరోగ్యకరమైన జీవనశైలే ఆరోగ్య సమస్యల ప్రమాదం నుంచి మనల్ని రక్షిస్తుందని గుర్తుంచుకోవాలి.

డాక్టర్‌తో మాట్లాడండి: కొన్ని మందులు, గర్భనిరోధకాలు, హార్మోన్ పునఃస్థాపన చికిత్స రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. మీ పర్సనల్‌ డాక్టర్‌తో రొమ్ము క్యాన్సర్‌పై మనుసు విప్పి మాట్లాడండి. విషయాలు తెలుసుకోండి. వారి సలహాలు తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనానికి మెట్లు వేసుకోవాలి. రొమ్ముల్లో ఎలాంటి అసాధాణతను గుర్తించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకురావాలి. 40 ఏండ్ల వయసు దాటిన ప్రతీ ఒక్కరు ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి.

కొసమెరుపు..

క్యాన్సర్ సంకేతాలు, లక్షణాల కోసం రొమ్మును స్కాన్ చేసే ప్రక్రియనే స్క్రీనింగ్ అంటారు. స్క్రీనింగ్‌లో రొమ్ము మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్, మామోగ్రామ్, ఇతర క్లినికల్ పరీక్షలు వంటి కొన్ని సాధారణ పద్ధతులు ఉంటాయి. ఇవి మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించలేకపోయినప్పటికీ, ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో సహాయపడుతాయి. ముందుగా గుర్తించడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను నివారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

జమ్ము చేరిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

చైనాకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నేపాల్‌ ప్రజలు

సిద్ధూ-చన్నీ భేటీ షురూ! హైక‌మాండ్ నుంచి దూత..

అహ్మదాబాద్‌లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!

ట్యునీషియాలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలిసారి మహిళకు అవకాశం

డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా నటుడు

రిటైర్మెంట్‌ ప్రకటించిన డ్రాగ్‌ ఫ్లికర్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement