Ahmedabad : అహ్మదాబాద్‌లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
Ahmedabad : గుజరాత్‌లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్‌లో రోడ్లను శుభ్రం చేయడానికన్నా ఎక్కువగా రోడ్ల మరమ్మతులకు వెచ్చిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు...

అహ్మదాబాద్ : (Ahmedabad) గుజరాత్‌లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్‌లో రోడ్లను శుభ్రం చేయడానికన్నా ఎక్కువగా రోడ్ల మరమ్మతులకు వెచ్చిస్తున్నారు. ఇటీవలి వర్షాలకు కొత్త, పాత రోడ్లపై కంకర తేలి గుంతలు పడటంతో వాటిని పూడ్చేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తున్నది. రోడ్లను శుభ్రం చేయడానికి పెట్టే ఖర్చు కంటే 50 శాతం నుంచి 178 శాతం వరకు అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) ఖర్చు చేస్తున్నట్లు వారి నివేదికలే వెల్లడిస్తున్నాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు గుజరాత్‌లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్ గుంతలమయంగా తయారైంది. పాత, కొత్త రోడ్లన్నీ చెడిపోయి వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. ఏఎంసీ పంచవర్ష బడ్జెట్ ప్రణాళిక నుంచి సేకరించిన డాటా ప్రకారం, ఈ పౌరసంస్థ 2015-2020 మధ్య రోడ్లను శుభ్రపరచడానికి దాదాపు రూ.1,432 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో శుభ్రపరిచే మొత్తంలో సగం రూ.693 కోట్లను రోడ్ల మరమ్మతులకు ఖర్చు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, 2017 లో రోడ్లను శుభ్రం చేయడానికి రూ.277 కోట్లు, వాటి నిర్వహణకు రూ.99 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
అలాగే, 2016-17లో 178 శాతం, 2017-18లో 122 శాతం, 2018-19లో 134 శాతం, 2019-20లో 105 శాతం అధికంగా శుభ్రపరిచేందుకు ఖర్చు చేసినట్లు ఏఎంసీ డాటా చూపిస్తుంది. నీటి పైపులు, డ్రైనేజీ, విద్యుత్, టెలిఫోన్ వైర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టడం వలన రోడ్లు ఎక్కువ కాలం మనడం లేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎప్పుడు చూసిన గోతులు పూడ్చుతూ తమ సిబ్బంది కనిపిస్తున్నారని ఆయన తెలిపారు.
ఏఎంసీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హితేష్ బరోట్ ప్రకారం, దసరా పండుగ తర్వాత కార్పొరేషన్ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నది. రూ.225 కోట్లతో 225 కిమీ మేర కొత్త రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంటే 1 కిలోమీటర్ రోడ్డుకు రూ.కోటి ఖర్చు చేస్తుండటం అన్నమాట.
ఇవి కూడా చదవండి..
ట్యునీషియాలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలిసారి మహిళకు అవకాశం
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా నటుడు
రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

