Rupinder Pal Singh : రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
Rupinder Pal Singh : భారత హాకీ సీనియర్ సభ్యుడు, డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో...

న్యూఢిల్లీ : (Rupinder Pal Singh) భారత హాకీ సీనియర్ సభ్యుడు, డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్ పాల్ సింగ్ తన రిటైర్మెంట్ ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో వీరోచితంగా పోరాడి భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. బుధవారం ఉదయం తన రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆయన అభిమానులు నిరాశకు గురయ్యారు.
‘అందరికీ నమస్కారం. మీ అందరితో ఒక ముఖ్యమైన ప్రకటనను పంచుకోవాలనుకుంటున్నాను’ అని రూపిందర్ పాల్ సింగ్ ట్విట్టర్లో తన రిటైర్మెంట్ ప్రకటన రాశారు. ‘భారత హాకీ జట్టు నుంచి రిటైర్ అవ్వాలనే నా నిర్ణయం గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. గత రెండు నెలలు నిస్సందేహంగా నా జీవితంలో అత్యుత్తమ రోజులు అని చెప్తాను. టోక్యోలో వేదికపై నిలబడి సహచర క్రీడాకారులతో కలిసి ఎన్నో అనుభూతులను పంచుకున్నాను. నా జీవితంలో అత్యంత నమ్మశక్యం కాని అనుభూతులు అవి. గత 13 సంవత్సరాల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావిస్తున్నాను. ప్రతిభావంతులైన క్రీడాకారులకు మార్గదర్శనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 223 మ్యాచుల్లో ఇండియా జెర్సీ ధరించే గౌరవం దక్కడం అనిర్వచనీయం. ఈ గొప్ప క్రీడను ఇష్టపడే దేశం కోసం ఆడే అవకాశం నాకు దక్కింది’ అని రూపిందర్ తన అనుభూతులను పంచుకున్నారు.
‘భారతదేశానికి ఒలింపిక్ పతకం సాధించాలనే గొప్ప కలను సాకారం చేసిన జట్టులో సభ్యుడిగా ఉండి రిటైర్మెంట్ తీసుకుంటున్నందుకు సంతోషంగా, సంతృప్తిగా అనుభూతి చెందుతున్నాను. ప్రపంచ హాకీలోని అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఆడిన జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నాను. హాకీలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను’ అని రూపిందర్ పాల్ సింగ్ చెప్పారు. ఈ సందర్భంగా తనకు ఎంతో ప్రోత్సాహమిచ్చిన కుటుంబసభ్యులకు, హాకీ ఇండియాకు, కోచ్‌లకు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియా తరఫున 223 మ్యాచులు ఆడిన రూపిందర్.. 119 గోల్స్ సాధించారు. 2010 లో సుల్తాన్ అజ్లాన్ షా కప్ పోటీల ద్వారా ఆరంగేట్రం చేసిన రూపిందర్ పాల్ సింగ్.. ఫుల్ బ్యాక్‌లో ఆడుతూ భారత డ్రాగ్ ఫ్లికర్‌గా పేరుగడించారు.
ఇవి కూడా చదవండి..
సరిహద్దు దాటి వచ్చి వంతెన కూల్చిన చైనా సైన్యం.. ఎక్కడంటే?
పట్టణ ప్రజల్లో తలనొప్పికి ఇదే కారణం..! బేయర్స్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నేటికి కరువు సహాయక చర్యలు చేపట్టకపోవడం శోచనీయం’
KTR | కాంగ్రేసోళ్లే ఒక్కొక్కరుగా అన్నీ బయటపెడుతున్నరు : కేటీఆర్
TVK MLA VS Babu Dies | స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు.. అనారోగ్యంతో కన్నుమూత
Orange alert | బంగాళాఖాతంలో కొనసాగుతున్న అక్వాన్ తీవ్ర తుపాను.. ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్ అనర్హుడు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

