Oxford study : కరోనాతో 2 ఏండ్లు తగ్గిన ఆయువు
Oxford study : కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలకు మరో నష్టం కూడా జరుగనున్నది. అది మనిషి ఆయుర్దాయం గణనీయంగా క్షీణించడం...

లండన్ : (Oxford study) కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలతో ఇప్పటికీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ప్రజలకు మరో నష్టం కూడా జరుగనున్నది. అది మనిషి ఆయుర్దాయం గణనీయంగా క్షీణించడం. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఒక వ్యక్తి సగటు ఆయుర్దాయం తగ్గిపోతున్నది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎక్కువ ఆయుర్దాయం క్షీణించడం ఇదే.
ఐరోపా దేశాలు, అమెరికా, చిలీతో పాటు 29 దేశాలకు గాను 27 దేశాలతో 2019 తో పోలిస్తే ఇప్పుడు ఆయుర్దాయం తగ్గిందని పరిశోధనలో తేలింది. చాలామంది అమెరికన్ పురుషుల ఆయుర్దాయం 2.2 సంవత్సరాలకు పైగా తగ్గినట్లు గుర్తించారు. ఇప్పటివరకు, ప్రపంచవ్యాప్తంగా 47 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా కారణంగా మరణించారు.
‘పరిశోధన ప్రకారం చాలా దేశాల్లో మహిళల కంటే పురుషుల ఆయుర్దాయం మరింత క్షీణించింది. 15 దేశాల్లో పురుషుల ఆయుర్దాయం ఏడాదికి పైగా తగ్గింది. 11 దేశాల్లో మహిళల ఆయుర్దాయం తగ్గుదల గమనించారు’ అని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ప్రచురించబడిన రీసెర్చ్ పేపర్ కో-హెడ్, రచయిత డాక్టర్ రిద్ధి కశ్యప్ తెలిపారు.
కరోనా మూలాన్ని మళ్లీ పరిశీలిస్తాం: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ ఆరిజిన్‌ను తిరిగి పరిశీలించాలని నిర్ణయించింది. దీని కోసం 20 మంది శాస్త్రవేత్తల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్య సమితి బృందానికి చైనా అందించిన డాటా సరిపోదని తేలినందున డబ్ల్యూహెచ్ఓ మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. వైరస్ మూలం గురించి యూఎన్ బృందానికి చైనాలో ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
ఇవి కూడా చదవండి..
గుండెను కాపాడుకుందాం.. హాయిగా జీవిద్దాం
మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!
కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

