Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఆయన బ్రెయిన్ హెమరేజ్‌తో కోమాలోకి వెళ్లారని.. చికిత్స తీసుకుంటూ మరణించారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.
Kim Jong Un | ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఆయన బ్రెయిన్ హెమరేజ్‌తో కోమాలోకి వెళ్లారని.. చికిత్స తీసుకుంటూ మరణించారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. కిమ్ చనిపోవడంతో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాను ఆధీనంలోకి తీసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలు రోజురోజుకీ పెరిగిపోతుండటంతో వీటికి ఉత్తర కొరియా చెక్ పెట్టింది. ఓ ప్రదర్శనలో కిమ్ పాల్గొన్న ఫొటోలను ప్రభుత్వ మీడియా బయటపెట్టింది.
ఉత్తర కొరియా ప్రభుత్వ పత్రిక రోడాంగ్ సిన్మున్ ప్రచురించిన ఫొటోల ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ వస్త్రాలు, పాదరక్షల ప్రదర్శనను సందర్శించారు. అక్కడ మహిళా ఉద్యోగి చేతిలో ఉన్న చిన్న గులాబీ రంగు షూను పరిశీలిస్తున్నట్లు ఓ ఫొటోలో కనిపించారు. మరో చిత్రంలో అధికారులతో మాట్లాడుతూ చేతులను చాపి ఉన్నారు. ఇంకో ఫొటోలో బొమ్మపై ప్రదర్శనకు ఉంచిన మహిళల కోటు స్లీవ్‌ను తాకుతూ కనిపించారు. అయితే ఫొటోలు ఎప్పుడు తీసినవో స్పష్టత లేదు.

Kim Jong Un2
అసలు వదంతులు ఎలా మొదలయ్యాయి?
అమెరికాలో నివసిస్తున్న చైనా అసమ్మతవాది వాంజున్ షీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై సంచలన ఆరోపణలు చేశారు. తొలుత కిమ్ మరణించారని, వారసత్వ సంక్షోభం తలెత్తవచ్చనే ఆందోళనల నేపథ్యంలో బీజింగ్ నుంచి 9,000 మంది సైనికులను ప్యాంగ్యాంగ్కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కిమ్‌కు తీవ్రమైన మెదడు రక్తస్రావం జరిగిందని, చికిత్స కోసం బీజింగ్‌లోని పెకింగ్ యూనియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి వైద్యుల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపినట్లు ఆరోపించారు. కిమ్ కోమాలోకి వెళ్లారని, అనంతరం బీజింగ్‌కు తరలించినప్పటికీ వైద్యులు ఆయనను కాపాడలేకపోయారని పేర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని రహస్యంగా ఉత్తర కొరియాకు తిరిగి తీసుకొచ్చినట్లు కూడా ప్రచారం చేశారు. అయితే, ఈ వాదనలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు లేదా స్వతంత్రంగా ధ్రువీకరించగల సమాచారం బయటకు రాలేదు.

Kim Jong Un3
గతంలోనూ ఇలాంటి ప్రచారం
కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వదంతులు రావడం ఇదే తొలిసారి కాదు. 2020లో ఆయన గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స తర్వాత మరణించారని దాదాపు 99 శాతం నమ్మకంతో చెప్పగలనంటూ ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లిన జీ సియోంగ్-హో ప్రకటించారు. ఆ తర్వాత కిమ్ బహిరంగంగా కనిపించడంతో ఆ ప్రచారం తప్పని తేలింది. అనంతరం జీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

