e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News Migraine : మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!

Migraine : మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!

(Migraine) మైగ్రేన్‌.. చాలా మందిని వేధించే సమస్య. తల పేలిపోతున్నట్లుగా.. తలపై కత్తితో పొడిచినట్లుగా, మెడ మెలితిప్పుతున్నట్లుగా భావన కలుగుతోంది. చాలా మంది నొప్పిని భరించలేక చెవులను మూసి తలవంచుకుని కూర్చోవడం వంటివి చేస్తుంటారు. కొంచెం శబ్ధం విన్నా భరించలేరు. కాంతిని చూడాలంటే ఇబ్బంది పడతారు. వాంతులు అవుతుంటాయి. మైకం కమ్మినట్లుగా అనిపిస్తుంది. అయితే, మైగ్రేన్‌ ఎందుకు వస్తుందనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. జన్యుపరమైన సమస్యల వల్ల, కొన్ని పర్యావరణ కారకాల వల్ల సంభవిస్తుందని కొందరు చెప్తుంటారు.

మైగ్రేన్ అనేది ఒక రకమైన తలనొప్పి రుగ్మత అని వైద్యనిపుణులు చెప్తున్నారు. తలనొప్పి మొదలవడానికి ఒకటి నుండి రెండు రోజుల ముందు మైగ్రేన్ లక్షణాలు ప్రారంభమవుతాయని వారంటున్నారు. ఈ దశలో ఆహార కోరికలు, అలసట, డిప్రెషన్, హైపర్‌ యాక్టివిటీ, చిరాకు వంటివి కనిపిస్తాయని, మైగ్రేన్ సాధారణంగా తలపై ఒక వైపు మాత్రమే ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారు కొన్ని ఆహారాలను దూరం పెట్టడం ద్వారా మైగ్రేన్‌ సమస్య నుంచి బయటపడొచ్చునని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

చాక్లెట్లు : మైగ్రేన్ దాడులకు చాక్లెట్లు కామన్‌ ట్రిగ్గర్స్‌. అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చాక్లెట్లు మైగ్రేన్ అనుభవించే 22 శాతం మందిని ప్రభావితం చేస్తాయి.

కెఫిన్ : ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ దాడిని ప్రేరేపిస్తుంది. చాక్లెట్, కాఫీ, టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తక్కువ పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

ఆల్కహాల్‌ : ఒక అధ్యయనం ప్రకారం, పార్శ్వపు నొప్పి ఉన్న 35 శాతం మందికి ఆల్కహాల్ సాధారణ ట్రిగ్గర్‌లలో ఒకటి. ఆల్కహాల్‌ను తగ్గించడం చాలా మంచిది.

అస్పర్టమే (కృత్రిమ చక్కెర) : అనేక ప్రాసెస్ చేసిన ఆహారాలు కృత్రిమ స్వీటెనర్లతో నిండి ఉంటాయి. ఈ కృత్రిమ చక్కెరలు మైగ్రేన్‌కి కారణం అవుతుంటాయి.

మోనోసోడియం గ్లూటామేట్ఉన్న ఆహారాలు: అమెరికన్ మైగ్రెయిన్ ఫౌండేషన్ ప్రకారం, ఇది తీవ్రమైన మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది.

క్యూర్డ్‌ మీట్స్‌ : రంగు, రుచిని కాపాడే నైట్రేట్లు.. డెలి మాంసాలు, హామ్, హాట్ డాగ్‌లు, సాసేజ్‌లలో కనిపిస్తాయి. ఈ ఆహారాలు రక్తంలోకి నైట్రిక్ ఆక్సైడ్‌ను విడుదల చేస్తాయి. మెదడులోని రక్తనాళాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉంటాయి.

ఏజ్డ్‌ చీజ్ లేదా టైరమైన్ : టైరమైన్ కూడా మైగ్రేన్‌కు ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. ఇది పులియబెట్టిన లేదా పాతబడిన చీజ్‌, సోయా సాస్ వంటి ఆహారాలలో కనిపిస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

హోం మంత్రి అనిల్‌ విజ్‌కు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక

కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!

మరో 3 రోజుల్లో దుబాయ్‌ ఎక్స్‌పో

విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్‌.. అరికట్టండిలా!

క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్‌కు చెక్‌.. మాంట్రియల్ పరిశోధన

ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌పై మరోసారి దాడి

అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్‌

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement