Depression : క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్‌కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
Depression : చిన్నారుల్లో ఆందోళన, విచారం పోగొట్టేందుకు వారిని క్రీడలు, ఇతర యాక్టివిటీల వైపు మళ్లించాలి. తల్లిదండ్రులు తమ చిన్నారులను...

(Depression) చిన్నారుల్లో ఆందోళన, విచారం పోగొట్టేందుకు వారిని క్రీడలు, ఇతర యాక్టివిటీల వైపు మళ్లించాలి. తల్లిదండ్రులు తమ చిన్నారులను ఆ విధంగా ప్రోత్సహించాలి. కౌమార దశలో చురుకుగా ఉండే చిన్నారులు చాలా తక్కువ భావోద్వేగానికి గురవుతారు. కెనడాకు చెందిన మాంట్రియల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు.
మానసిక ఆరోగ్యంపై పిల్లల శారీరక శ్రమ ప్రభావం కనిపించిందని మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మరియా జోస్ చెప్పారు. దీని కోసం 5 నుంచి 12 ఏండ్ల వయసు గల బాలురు, బాలికలపై పరిశోధన చేపట్టారు. శారీరక శ్రమ గురించి ఈ పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులను కూడా ప్రశ్నించారు. 5 సంవత్సరాల వయస్సులో క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనని పిల్లలు.. త్వరగా అలసిపోతున్నట్లు వెల్లడించారు. వీరిలో అరవడం, భయంగా చూడటం వంటి లక్షణాలు కూడా కనిపించాయి. 12 సంవత్సరాల వయస్సులో కూడా శారీరకంగా చురుగ్గా లేని పిల్లల్లో డిప్రెషన్, ఆందోళన కేసులు ఎక్కువగా కనిపించినట్లు పరిశోధన నివేదికలో పేర్కొన్నారు. అయితే, బాలికల్లో పెద్ద మార్పులేవీ కనిపించలేదు.
తమ చుట్టూ ఉండే వాతావరణం చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియజేయడమే తమ పరిశోధన ముఖ్యోద్దేశమని పరిశోధకులు తెలిపారు. తల్లిదండ్రుల చదువుతోపాటు వారి ఆదాయం కూడా వారిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. పాఠశాలకు వెళ్లే ముందు కూడా తేలికపాటి శారీరక శ్రమ చేసే అబ్బాయిలు.. స్కూల్లో తోటి విద్యార్థులతో కలిసి పనిచేయడం, తమను తాము నియంత్రించుకోవడం, ఇతరులతో మంచి సంబంధాలను పెంచుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారని తేల్చారు.
డిప్రెషన్, విశ్రాంతి తీసుకోకపోవడం వంటి అంశాల విషయంలో బాలురు, బాలికల మధ్య వ్యత్యాసం ఉన్నదని పరిశోధకులు తెలిపారు. అబ్బాయిల్లో డిప్రెషన్ కారణంగా సమాజం నుంచి దూరమవుతారు. ఇదే సమయంలో అమ్మాయిలు డిప్రెషన్, విశ్రాంతి లేనప్పుడు వారు స్నేహితుల సాయం తీసుకుని వారితో విషయాలు పంచుకొంటారు. ఫలితంగా డిప్రెషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే, అమ్మాయిలు అబ్బాయిల కంటే భావోద్వేగాలను బాగా నియంత్రించుకుంటారని పరిశోధకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌పై మరోసారి దాడి
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

