Emmanuel Macron : ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌పై మరోసారి దాడి
Emmanuel Macron : ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై మరోసారి దాడి జరిగింది. నాలుగు నెలల కాలంలో ఇది రెండో దాడి కావడం విశేషం. లియాన్ పర్యటనలో...

పారిస్ : (Emmanuel Macron) ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై మరోసారి దాడి జరిగింది. నాలుగు నెలల కాలంలో ఇది రెండో దాడి కావడం విశేషం. లియాన్ పర్యటనలో ఉన్న మాక్రాన్‌పై సోమవారం సాయంత్రం ఒక వ్యక్తి కోడిగుడ్డుతో దాడి చేశాడు. అది మాక్రాన్ ఎడమ భుజానికి తగిలింది. అప్రమత్తమైన భద్రతా దళాలు ఆయనను క్షేమంగా పక్కకు తీసుకెళ్లాయి. కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులు విచారిస్తున్నారు.
లియాన్ పర్యటనలో ఫ్రెంచ్ గ్యాస్ట్రోనమీని ప్రోత్సహించేందుకు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చారు. సందర్శకుల్లో నుంచి ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా మాక్రాన్పైకి కోడిగుడ్డు విసిరాడు. గుడ్డు మాక్రాన్ భుజానికి తాకి కింద పడిపోయింది. గుడ్డు పచ్చిగా ఉండటంతో అది పగల్లేదు. అప్రమత్తమైన అంగరక్షకులు.. మాక్రాన్‌ను పక్కకు తీసుకెళ్లిపోయారు. అయితే, అతడు ఏమైనా చెప్పదలుచుకుంటే అతడ్ని నావద్దకు రానివ్వండి అని మాక్రాన్ చెప్పాడు. తర్వాత కొన్ని ఫొటోల్లో అతడు నేల మీద పడిపోయినట్లు కనిపించాడు. సంఘటన జరిగినప్పుడు అంతర్జాతీయ క్యాటరింగ్, హాస్పిటాలిటీ ఫెయిర్‌కు హాజరైన మాక్రాన్.. అక్కడ గుమిగూడిన తన మద్దతుదారులతో మాట్లాడుతున్నారు.
నాలుగు నెలల క్రితం కూడా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై దాడి జరిగింది. ప్రజలను కలుస్తుండగా ఒక వ్యక్తి మాక్రాన్ చెంపపై కొట్టాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ ఏజెంట్లు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
ఎప్పుడో కొన్న షేర్లకు కోట్ల విలువ.. ఇప్పించాలని సెబీని ఆశ్రయించిన బాబు జార్జ్ వలవి
సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్ కంటైనర్ల ఏర్పాటు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కడి స్తంభాలు అక్కడే!
ఏఐ దెబ్బ.. ‘గెట్టి ఇమేజెస్’ దివాలా
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

