Artificial coffee : కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
Artificial coffee : పెరుగుతున్న కాఫీ డిమాండ్‌ని తీర్చడానికి ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు దారి కనిపెట్టారు. ల్యాబ్‌లో కృత్రిమ కాఫీని తయారు చేసి ఔరా..

(Artificial coffee) పెరుగుతున్న కాఫీ డిమాండ్‌ని తీర్చడానికి ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు దారి కనిపెట్టారు. ల్యాబ్‌లో కృత్రిమ కాఫీని తయారు చేసి ఔరా అనిపించారు. ఈ పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా చెట్ల నరికివేతను కూడా అడ్డుకోవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాఫీని ఫిన్లాండ్ వీటీటీ టెక్నికల్ రీసెర్చ్ సెంటర్ ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు.
ఈ కాఫీ రుచి, వాసనలో అసలైన కాఫీని పోలి ఉంది. కాఫీ ఎక్కువగా వినియోగించే దేశాల్లో ఒకటైన ఫిన్లాండ్ శాస్త్రవేత్తల కృషి.. రానున్న రోజుల్లో కాఫీకి కొరత లేకుండా చేసింది. ఈ కృత్రిమ కాఫీని 2025 నాటికి మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రయోగశాలలో కృత్రిమ మాంసం, పాలను తయారు చేసిన విషయం తెలిసిందే.
ప్రయోగశాలలో కాఫీని సిద్ధం చేసేందుకు ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు అరబికా మొక్కను ఎంచుకున్నారు. అరబికా కణాల నమూనాలను తీసుకుని.. వాటి నుంచి ప్రయోగశాలలో ఈ కాఫీని తయారు చేశారు.
అరబికా మొక్కతో..
ప్రపంచవ్యాప్తంగా కాఫీ ఉత్పత్తిలో 56 శాతం వరకు అరబికా ప్లాంట్ సహాయంతోనే జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే ఈ మొక్కను కాఫీ తయారీకి ఉపయోగించారు. 47 ఏండ్ల వయసున్న మొక్క కణాల నుంచి కాఫీని తయారు చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. ల్యాబ్‌లో తయారు చేసిన ఈ కొత్త కాఫీ రుచి, వాసన ఒరిజినల్ కాఫీ మాదిరిగానే ఉన్నదని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ హైకో రిషర్ చెప్పారు. కొత్తగా తయారు చేసిన కాఫీ తాగిన అనుభవం అద్భుతంగా ఉన్నదన్నారు.
తప్పనున్న చెట్లు నరకడం..
ఈ కొత్త విధానంలో కాఫీని ల్యాబ్‌లో తయారుచేయడం వలన భవిష్యత్‌లో చెట్లను నరికే బాధ తప్పనున్నదని పరిశోధకులు తెలిపారు. కాఫీ కోసం డిమాండ్ పెరుగుతున్న కొద్దీ పాత కాఫీ చెట్లను నరికివేస్తున్నారని, ల్యాబ్ కాఫీతో ఆ సమస్యకు ముగింపు పలుకవచ్చునని వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మరో 3 రోజుల్లో దుబాయ్ ఎక్స్పో
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్‌కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌పై మరోసారి దాడి
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

