Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
Bodies of SPOs | ఇటీవల కిష్ట్వార్ (Kishtwar) లో జరిగిన ఉగ్రవాదుల (Terrorists) దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారుల (SPOs) మృతదేహాలను ఒక డంపర్‌లో వారి స్వగ్రామానికి పంపించారు. ఈ ఘటన తీవ్ర ఆగ్రహానికి, దుఃఖానికి కారణమైంది. వీరమరణం పొందిన SPOలు బాబీచంద్, రష్పాల్ కుమార్ల మృతదేహాలను శవపేటికలు లేకుండా డంపర్‌లో వారి స్వగ్రామానికి తీసుకురావడంతో కియార్ గ్రామంలో నెలకొన్న విషాద వాతావరణం ఆగ్రహంగా మారింది.
Bodies of SPOs : ఇటీవల కిష్ట్వార్ (Kishtwar) లో జరిగిన ఉగ్రవాదుల (Terrorists) దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారుల (SPOs) మృతదేహాలను ఒక డంపర్‌లో వారి స్వగ్రామానికి పంపించారు. ఈ ఘటన తీవ్ర ఆగ్రహానికి, దుఃఖానికి కారణమైంది. వీరమరణం పొందిన SPOలు బాబీచంద్, రష్పాల్ కుమార్ల మృతదేహాలను శవపేటికలు లేకుండా డంపర్‌లో వారి స్వగ్రామానికి తీసుకురావడంతో కియార్ గ్రామంలో నెలకొన్న విషాద వాతావరణం ఆగ్రహంగా మారింది.
ఈ ఆగ్రహంలోనే గ్రామస్తులు వారికి పూర్తి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాలతోపాటు ఏ ఉన్నతాధికారి కూడా రాలేదని వారు తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఆ ఇద్దరు వీరయోధులను సాధారణ వస్తువులలా తరలించడంతో అప్పటికే తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీజేపీ నాయకుడు, జమ్మూకశ్మీర్ ప్రతిపక్ష నేత సునీల్ శర్మ, కిష్ట్వార్ శాసనసభ్యురాలు షగున్ పరిహార్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సిబ్బంది మృతదేహాలను ఇంత అవమానకరంగా ఎలా చూస్తారని ప్రశ్నించారు. మృతదేహాలను తరలించడానికి తమకు కనీసం ఒక స్ట్రెచర్ కూడా ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపించారు. చివరికి సైన్యం నుంచి ఒక స్ట్రెచర్ తీసుకోవాల్సి వచ్చిందన్నారు. మృతదేహాన్ని కప్పడానికి తెల్లటి వస్త్రాన్ని కూడా తామే స్వయంగా సంపాదించుకున్నామని ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్‌లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
Kondagattu | కొండగట్టులో ఆర్జిత సేవలు , వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేత
Response | నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. కాల్వకు మరమ్మతులు ప్రారంభం
Vijay Sethupathi | సూపర్ డీలక్స్ కాంబో వన్స్‌మోర్.. విజయ్ సేతుపతి నుంచి క్రేజీ అప్డేట్
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

