Response | నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. కాల్వకు మరమ్మతులు ప్రారంభం
Response | నమస్తే తెలంగాణ దినపత్రిక లో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు స్పందన లభించింది.
మాగనూరు : నమస్తే తెలంగాణ దినపత్రిక ( Namaste Telangana) లో ప్రచురితమైన కథనానికి ఎట్టకేలకు స్పందన (Response) లభించింది. కాల్వకు (Canal Repairs ) గండి పడి సాగునీరు వృథాగా పోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రచురితమైన కథనం ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. దీంతో మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు శనివారం కాల్వ మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి.

కాల్వకు పడిన గండిని పూడ్చే పనులతో పాటు కాల్వలో పేరుకుపోయిన పూడికను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి సమక్షంలో జేసీబీ యంత్రాల సహాయంతో పనులు చేపట్టారు. కాల్వకు పడిన గండి కారణంగా నీరు వృథాగా పోతుండటంతో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ నీటి వృథా కనిపించదా..?’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది.
సాగునీటి కాల్వల నిర్వహణలో నిర్లక్ష్యం, గండి పూడ్చడంలో జాప్యం, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కథనం ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు. వార్త ప్రచురితమైన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులు ప్రారంభం కావడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రజా సమస్యలపై ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో కదలిక తీసుకురావడమే కాకుండా సమస్య పరిష్కారానికి దోహదపడటంతో స్థానికంగా నమస్తే తెలంగాణ కథనంపై హర్షం వ్యక్తమవుతోంది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Response | నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. కాల్వకు మరమ్మతులు ప్రారంభం
Vijay Sethupathi | సూపర్ డీలక్స్ కాంబో వన్స్‌మోర్.. విజయ్ సేతుపతి నుంచి క్రేజీ అప్డేట్
తుంగతుర్తిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

