తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ వర్కర్స్ యూనియన్ అగ్రభాగాన ఉంటుందని తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు సుంకరి శ్రీనివాస్, జి,శ్రీదేవి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం...
సూర్యాపేట, నవంబర్ 14 : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ వర్కర్స్ యూనియన్ అగ్రభాగాన ఉంటుందని తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శులు సుంకరి శ్రీనివాస్, జి,శ్రీదేవి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం శనివారం సుంకరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతూ వారి హక్కుల సాధన కోసం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో నల్గొండ రీజియన్ ను తెలంగాణ వర్కర్స్ యూనియన్, ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఐక్య కూటమి కైవసం చేసుకోవడం హర్షణీయమని తెలిపారు. తెలంగాణ వర్కర్స్ యూనియన్, ఎస్ డబ్ల్యుఎఫ్ ఐక్య కూటమి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శాయ శక్తుల కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శి గోపనబోయిన శ్రీనివాస్, ఆర్,ఆర్,రావు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో చైర్మన్ చైర్మన్ గా అబ్దుల్ గని, ముఖ్య సలహాదారుడిగా ఎన్.వీరయ్య, డిపో కమిటీ అధ్యక్షుడిగా పి,విప్లవ రెడ్డి, కార్యదర్శిగా మాచర్ల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కె.అంజయ్య, అదనపు కార్యదర్శులుగా పూడూరి రమేశ్, కె.సరిత రెడ్డి, ఉపాధ్యక్షులుగా వెలుగు జానయ్య, ఎండి, యూసుఫ్, అసిస్టెంట్ కార్యదర్శులుగా కె.రవి, శీలం భాస్కర్, టి.రవీందర్, జాయింట్ సెక్రటరీలుగా ఎండి.జానీ పాషా, ఎన్ లక్ష్మి, పి.విజయ భాస్కర్, డిపో కోశాధికారిగా పి,సి శేఖర్, రీజినల్ కమిటీ సభ్యులుగా చెరుకు వెంకటయ్య, నేతి సావిత్రి, ఎం,బుచ్చయ్య ఎన్నికైన వారిలో ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
Saatvika Veeravalli | టెకీ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ‘ఆకాశంలో ఒక తార’ విశేషాలు పంచుకున్న నటి సాత్విక వీరవల్లి!
CV anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
Threaten To Kill Commander, Jawan Sacked | కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియాలో బెదిరింపు.. జవాన్ తొలగింపు
Scholar | యువతను ఆకట్టుకునేలా ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

