Threaten To Kill Commander, Jawan Sacked | కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియాలో బెదిరింపు.. జవాన్ తొలగింపు
Threaten To Kill Commander, Jawan Sacked | తన బెటాలియన్ కమాండర్‌ను చంపుతానని పారామిలిటరీ జవాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో బెదిరించాడు. దీంతో అధికారులు దీనిపై దర్యాప్తు చేశారు. చివరకు ఆ జవాన్‌ను సర్వీస్ నుంచి తొలగించారు.
శ్రీనగర్: తన బెటాలియన్ కమాండర్‌ను చంపుతానని పారామిలిటరీ జవాన్ సోషల్ మీడియా పోస్ట్‌లో బెదిరించాడు. దీంతో అధికారులు దీనిపై దర్యాప్తు చేశారు. చివరకు ఆ జవాన్‌ను సర్వీస్ నుంచి తొలగించారు. (Threaten To Kill Commander, Jawan Sacked ) అస్సాంకు చెందిన పినాక్ నాథ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో ప్రొబేషనరీ కానిస్టేబుల్‌గా చేరాడు. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉన్న సీఆర్పీఎఫ్ 33వ బెటాలియన్‌లోని ఆల్ఫా కంపెనీలో అతడు పోస్టింగ్ పొందాడు. అయితే జవాన్ పినాక్ నాథ్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. తన కంపెనీ బెటాలియన్ కమాండర్‌ను చంపి తాను చనిపోతానని అందులో బెదిరించాడు. ఇటీవల మరో దళానికి చెందిన ఒక జవాన్ తన సర్వీస్ వెపన్తో సీనియర్‌ను, సహచరులను కాల్చి చంపిన సంఘటనను అతడు ప్రస్తావించాడు.
కాగా, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పినాక్ నాథ్ సోషల్ మీడియా పోస్ట్‌ను ఆ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణ జరిపారు. ఆ తర్వాత సర్వీస్ నిబంధనల మేరకు సీఆర్పీఎఫ్ జవాన్ పినాక్ నాథ్‌ను శుక్రవారం విధుల నుంచి తొలగించారు. క్రమశిక్షణను ఉల్లంఘించడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి సహించబోమని సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు సీఆర్పీఎఫ్ నుంచి తొలగించిన తర్వాత పినాక్ నాథ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. సస్పెండ్ లెటర్‌ను చేతిలో పట్టుకుని కనిపించాడు. తనను సర్వీస్ నుంచి తొలగించారంటూ అతడు ఏడ్చాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Threaten To Kill Commander, Jawan Sacked | కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియాలో బెదిరింపు.. జవాన్ తొలగింపు
Scholar | యువతను ఆకట్టుకునేలా ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ విడుదల!
యాసిన్ సాహసం స్ఫూర్తిదాయకం : ఈఎంసీ చైర్పర్సన్ పి.అనిత
AP News | ఇకపై అయ్యో పాపం అనేది లేదు.. చుక్కలు చూపిస్తాం.. ఏపీ సర్కారు తీరుపై బొత్స సత్యనారాయణ ఫైర్
ఎంజీయూలో దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్.. కొనసాగుతున్న విస్తృత చర్చలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

