యాసిన్ సాహసం స్ఫూర్తిదాయకం : ఈఎంసీ చైర్పర్సన్ పి.అనిత
ఇటీవల మురుసు తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను కాపాడడంలో కీలక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఒకరైన ఫేక్ యాసిన్ చూపిన సాహసం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని ఈఎంసీ చైర్పర్సన్ పి.అనిత అన్నారు.
ఖమ్మం రూరల్, నవంబర్ 14 : ఇటీవల మురుసు తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న జాలర్లను కాపాడడంలో కీలక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఒకరైన ఫేక్ యాసిన్ చూపిన సాహసం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అని ఈఎంసీ చైర్పర్సన్ పి.అనిత అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వాసి అయిన షేక్ యాసిన్‌ను శనివారం ఈఎంసీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈఎంసీ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. తొలుత యాసిన్‌కు పుష్పగుచ్చాలు అందించిన చైర్పర్సన్ అనంతరం కౌన్సిలర్లతో కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి జాలర్లను రక్షించిన యాసిన్ నేడు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. తోటి వ్యక్తులు ప్రమాదంలో ఉన్న సమయంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడడంలో చూపిన తెగువ యువతకు ఎంతో ప్రేరణ ఇచ్చిందన్నారు. యాసిన్ ఈఎంసీ వాసి కావడం మన అందరికీ గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు నాగేంద్ర ప్రసాద్, బుర్ర మహేశ్, కడవ నవీన్, దివ్య పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యాసిన్ సాహసం స్ఫూర్తిదాయకం : ఈఎంసీ చైర్పర్సన్ పి.అనిత
AP News | ఇకపై అయ్యో పాపం అనేది లేదు.. చుక్కలు చూపిస్తాం.. ఏపీ సర్కారు తీరుపై బొత్స సత్యనారాయణ ఫైర్
ఎంజీయూలో దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్.. కొనసాగుతున్న విస్తృత చర్చలు
Sajjala Ramakrishna Reddy | పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలి.. శ్రేణులకు వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల పిలుపు
Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

