AP News | ఇకపై అయ్యో పాపం అనేది లేదు.. చుక్కలు చూపిస్తాం.. ఏపీ సర్కారు తీరుపై బొత్స సత్యనారాయణ ఫైర్
AP News | రాజకీయ ప్రత్యర్థులపై గతంలో సానుభూతి చూపించామని, అయ్యోపాపం అనుకున్నామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము సానుభూతి చూపితే ఇప్పటి ప్రభుత్వం తమపట్ల కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు.
AP News : రాజకీయ ప్రత్యర్థులపై గతంలో సానుభూతి చూపించామని, అయ్యోపాపం అనుకున్నామని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము సానుభూతి చూపితే ఇప్పటి ప్రభుత్వం తమపట్ల కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కక్షపూరిత రాజకీయాలు చేసేవారికి తగిన రీతిలో సమాధానం చెబుతామని, చుక్కలు చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇకముందు గతంలోలా రాజకీయ ప్రత్యర్థులపై అనవసర సానుభూతి చూపిస్తూ ‘అయ్యో పాపం’ అని వదిలేసే పరిస్థితులు ఉండవని బొత్స చెప్పారు. రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అందరినీ సమానంగా చూసే రాజకీయాలు ప్రస్తుత వాతావరణంలో ఇకపై పని చేయవేమోనని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఎదురవుతున్న పరిస్థితులు, పార్టీ వర్గాలు అనుసరించాల్సిన వైఖరి గురించి తన అభిప్రాయాలను ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు బొత్స వెల్లడించారు. కక్షసాధింపు చర్యలను ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఇకపై అయ్యో పాపం అనేది లేదు.. చుక్కలు చూపిస్తాం.. ఏపీ సర్కారు తీరుపై బొత్స సత్యనారాయణ ఫైర్
ఎంజీయూలో దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్.. కొనసాగుతున్న విస్తృత చర్చలు
Sajjala Ramakrishna Reddy | పంచాయతీల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలి.. శ్రేణులకు వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల పిలుపు
Food Poisoning | ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.. ఏం జాగ్రత్తలు పాటించాలి..?
U19 Asia Cup | చివరి బంతి వరకు ఉత్కంఠ.. పాక్పై భారత్ సంచలన విజయం!
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

