Saatvika Veeravalli | టెకీ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ‘ఆకాశంలో ఒక తార’ విశేషాలు పంచుకున్న నటి సాత్విక వీరవల్లి!
Aakasamlo Oka Tara | స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’.
Aakasamlo Oka Tara | స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నవంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ సాత్విక వీరవల్లి సినిమా విశేషాలను పంచుకున్నారు.
తన నేపథ్యం మరియు ఈ అవకాశం గురించి సాత్విక మాట్లాడుతూ… తాను యూఎస్‌లో పుట్టి పెరిగానని, ఇంజనీరింగ్, మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత రెండేళ్లు ఇంజనీర్‌గా పనిచేశానని తెలిపారు. అయితే క్రియేటివ్ రంగంలోకి రావాలనే ఆసక్తితో మొదట ‘కాంత’ సినిమాకు ఆడిషన్ ఇచ్చినా కుదరలేదని, ఆ తర్వాత మరో తమిళ సినిమా ఆడిషన్ ద్వారా ఇండియాకు వచ్చానని చెప్పారు. ఆ వెంటనే ‘ఆకాశంలో ఒక తార’ అవకాశం రావడంతో తన ఉద్యోగాన్ని పక్కనపెట్టి నటన వైపు అడుగులు వేసినట్లు వెల్లడించారు. ఇంట్లో తెలుగు వాతావరణం ఉండటంతో భాష త్వరగానే అలవాటయిందని, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నానని తెలిపారు. తనకు కర్ణాటక సంగీతంలో ప్రవేశం ఉండటంతోపాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నానని చెప్పారు.
ఈ చిత్రంలో తన పాత్ర చాలా ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుందని, ఎప్పుడూ అంతరిక్షం గురించే ఆలోచించే ఆ అమ్మాయి లక్ష్యం అంతరిక్షంలోకి వెళ్లడమేనని తెలిపారు. చుట్టుపక్కల వాళ్లు ఎంత కించపరిచినా లక్ష్యం వైపే దృష్టి పెట్టే ఈ క్యారెక్టర్ ప్రతి రంగంలో ఉన్నవారికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. దుల్కర్ సల్మాన్‌తో కలిసి నటించడం చాలా మంచి అనుభూతినిచ్చిందని, మొదటి రోజు జాతర సీన్ షూటింగ్లో తాను టెన్షన్ పడినప్పుడు ఆయన ఎంతగానో సపోర్ట్ చేశారని గుర్తుచేసుకున్నారు. శ్రుతి హాసన్ ఒక పవర్‌హౌస్ అని, రుహాని శర్మ ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారని వారిద్దరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. యూఎస్‌లో పెరిగిన తాను ఈ చిత్రంలో విలేజ్ అమ్మాయిగా కనిపించడం ఎంతో ఛాలెంజింగ్‌గా, కొత్త అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతం అందించారని, షూటింగ్ సమయంలో గంగరాజుతో మాట్లాడి సాహిత్యాంలోని ప్రతి పదానికి అర్థం తెలుసుకునేదాన్ని అని చెప్పారు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారని, కానీ ఈ సినిమాలో ఒక అమ్మాయి విజయం వెనుక ఒక గొప్ప మనసున్న అబ్బాయి ఉంటాడని, పరస్పరం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుందని తెలిపారు. ప్రస్తుతం తాను తమిళంలో ఒక ప్రాజెక్ట్ చేస్తుండగా, తెలుగులోనూ మరో ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, త్వరలోనే వాటి అధికారిక వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saatvika Veeravalli | టెకీ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ‘ఆకాశంలో ఒక తార’ విశేషాలు పంచుకున్న నటి సాత్విక వీరవల్లి!
CV anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
Threaten To Kill Commander, Jawan Sacked | కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియాలో బెదిరింపు.. జవాన్ తొలగింపు
Scholar | యువతను ఆకట్టుకునేలా ‘స్కాలర్’ ఫస్ట్ లుక్ విడుదల!
యాసిన్ సాహసం స్ఫూర్తిదాయకం : ఈఎంసీ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

