‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ములకలపల్లి మండలంలోని రాచన్నగూడెం యూపీఎస్ పాఠశాల వద్ద శుక్రవారం బాలల గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం...
– రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ
ములకలపల్లి, నవంబర్ 14 : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ములకలపల్లి మండలంలోని రాచన్నగూడెం యూపీఎస్ పాఠశాల వద్ద శుక్రవారం బాలల గ్రామ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొన్న సర్పంచ్ మడకం విజయ మాట్లాడుతూ.. నవ భారత నిర్మాణంలో, గ్రామ స్వరాజ్య సాధనలో పిల్లల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే గ్రామ నిర్ణయాల్లో అన్ని వర్గాలతో పాటు పిల్లల అభిప్రాయాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలన్నారు.
చిన్నారులకు బాల్యం నుంచే ప్రజాస్వామ్య విలువలు, బాలల హక్కులు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించేందుకు బాలల గ్రామసభ అద్భుతమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. గ్రామంలోని విద్యార్థులకు విద్యావకాశాలు, ఆటస్థలాలు, రక్షిత తాగునీరు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, బాలల రక్షణ, బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే సమయంలో పిల్లల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
ప్రతి గ్రామసభలో పిల్లలు పాల్గొనడం ద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి నేరుగా చేరుతాయని తెలిపారు. రాబోయే గ్రామసభల్లో పిల్లలు చురుగ్గా పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రోత్సహించాలని కోరారు. ఈ రోజు మీది పిల్లలూ.. బాగా చదువుకోవాలని, చాచా నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని గుర్తు చేశారు. నేడు విద్యార్థులుగా ఉన్న మీలోనే రేపటి సర్పంచులు, ఉపాధ్యాయులు, వైద్యులు, కలెక్టర్లు, ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారని అన్నారు. పిల్లల చదువులకు, అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి’
తెలంగాణ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట డిపో నూతన కమిటీ ఎన్నిక
Saatvika Veeravalli | టెకీ నుంచి టాలీవుడ్ హీరోయిన్గా.. ‘ఆకాశంలో ఒక తార’ విశేషాలు పంచుకున్న నటి సాత్విక వీరవల్లి!
CV anand | తెలంగాణ గ్రేహౌండ్స్ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్
Threaten To Kill Commander, Jawan Sacked | కమాండర్‌ను చంపుతానని సోషల్ మీడియాలో బెదిరింపు.. జవాన్ తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

