Nigerian actor : డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా నటుడు
Nigerian actor : పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఓ నటుడు.. మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై, చెన్నై, హైదరాబాద్, ఇతర నగరాలతో..

బెంగళూరు: (Nigerian actor) పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న ఓ నటుడు.. మాదక ద్రవ్యాలు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ముంబై, చెన్నై, హైదరాబాద్, ఇతర నగరాలతో పాటుగా శాండిల్‌వుడ్ చిత్ర పరిశ్రమతో అతనికున్న సంబంధాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
తమిళ బ్లాక్‌బస్టర్ సినిమాలు ‘సింగం’, ‘విశ్వరూపం’తోపాటు పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న నైజీరియాకు చెందిన నటుడు చెక్వుమే మాల్విన్ బెంగుళూరులో అరెస్టయ్యాడు. డ్రగ్స్ విక్రయిస్తూ అడ్డంగా బుక్కయ్యాడని పోలీసు వర్గాలు గురువారం తెలిపాయి. మెడికల్ వీసాపై బెంగళూరు కేఆర్ పురం సమీపంలోని భట్టరహళ్లిలో ఉంటున్న చెక్వుమే మాల్విన్ (45) ను కర్ణాటక పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లకు డ్రగ్స్ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా మూడు రోజుల క్రితం అతడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.7.5 లక్షల విలువైన 15 గ్రాముల ఎండీఎంఏ, 250 మిలీ హషీష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన ప్రకారం, నిందితుడు హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం భాషలతో పాటు 20 భారతీయ సినిమాల్లో నటించాడు. కన్నడ సినిమా ‘అన్నాబాండ్’ ‘పరమాత్మ’ లలో ప్రధాన పాత్రలో కనిపించాడు. నిందితుడు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నైజీరియా, ముంబైలో ఫిల్మ్ యాక్టింగ్ కోర్సు చేశాడు. మూడు నైజీరియన్ సినిమాల్లో కూడా నటించాడని పోలీసులు తెలిపారు. త్వరగా డబ్బు సంపాదించడం కోసం డ్రగ్స్ విక్రయించడం పనిగా పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్, 1985 కింద పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
సరిహద్దు దాటి వచ్చి వంతెన కూల్చిన చైనా సైన్యం.. ఎక్కడంటే?
పట్టణ ప్రజల్లో తలనొప్పికి ఇదే కారణం..! బేయర్స్ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

