Mohan Bhagwat : జమ్ము చేరిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కొద్ది సేపటి క్రితం జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. ఆయన జమ్ములో..

జమ్ము : (Mohan Bhagwat) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ కొద్ది సేపటి క్రితం జమ్ముకశ్మీర్ చేరుకున్నారు. ఆయన జమ్ములో నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జమ్ము అంబాలాలోని కేశవ్ భవన్‌కు వచ్చారు. ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 370, 35 ఏ రద్దుపై ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా ప్రయత్నాలు చేసింది. చివరకు మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370తోపాటు 35 ఏ ను రద్దు చేసింది. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత సర్సంఘ్చాలక్ జమ్ముకు రావడం ఇదే తిలిసారి. మోహన్ భగవత్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
జమ్ము అంబాలాలో ఉండనున్న నాలుగు రోజుల్లో మోహన్ భగవత్.. జమ్ముకశ్మీర్ ప్రావిన్స్ ప్రముఖ్లతోపాటు కార్యవర్గంతో వివిధ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏటా వివిధ రాష్ట్రాల ఆఫీస్ బేరర్ల సమీక్షను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే జమ్ముకశ్మీర్ సమావేశాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మోహన్ భగవత్ సమీక్షలు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2 న జమ్ము యూనివర్సిటీలోని జోరావర్ సింగ్ ఆడిటోరియంలో సెమినార్లో ప్రసంగిస్తారు. అక్టోబర్ 3 న జమ్ముకశ్మీర్‌లో అగ్రిగేషన్ సందర్భంగా ఆన్లైన్లో సంఘ వాలంటీర్లకు మార్గనిర్దేశం చేస్తారు.
ఇవి కూడా చదవండి..
చైనాకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నేపాల్ ప్రజలు
సిద్ధూ-చన్నీ భేటీ షురూ! హైకమాండ్ నుంచి దూత..
అహ్మదాబాద్‌లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
ట్యునీషియాలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలిసారి మహిళకు అవకాశం
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా నటుడు
రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

