Nepal : చైనాకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నేపాల్ ప్రజలు
Nepal : డ్రాగన్‌పై నేపాలీలు ఆగ్రహంతో ఉన్నారు. తమ భూభాగంలోకి చొచ్చకుని వచ్చి అక్రమంగా వాడుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. లోక్తాంత్రిక్ యువ మంచ్...

ఖాట్మండు : (Nepal) డ్రాగన్‌పై నేపాలీలు ఆగ్రహంతో ఉన్నారు. తమ భూభాగంలోకి చొచ్చకుని వచ్చి అక్రమంగా వాడుకోవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. గురువారం లోక్తాంత్రిక్ యువ మంచ్ ఆధ్వర్యంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘చైనా గో బ్యాక్’, ‘రిటర్న్ అవర్ ల్యాండ్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చైనా విస్తరణ విధానాన్ని విడనాడి తమ దేశం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ నేపాలీలు ఆందోళనకు దిగారు.
నేపాల్‌కు చెందిన హమ్లా జిల్లాలో చైనా అక్రమంగా 15 వరకు భవనాలను నిర్మించింది. వారి జిల్లాలో పాగావేసి నేపాలీలను ఇబ్బందిపెడుతున్నది. తమ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాట్మండులోని మహీతిఘర్ మండలాలో జరిగిన ఆందోళనలకు లోక్తాంత్రిక్ యువ మంచ్ (ఎల్వైయూ) నాయకత్వం వహించింది. ఈ ఆందోళనలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. నేపాల్‌లోని హుమ్లాలో చైనా ఆక్రమణలను తొలగించి, దీనిపై విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి వెళ్లకుండా స్థానిక ప్రజలను చైనా అడ్డగిస్తున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాఉండగా, కేపీ శర్మ ఒలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం చైనా ఆక్రమణలను తిరస్కరించింది. నేపాల్-చైనా మధ్య సరిహద్దు వివాదం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇలాఉండగా, ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ప్రధాన మంత్రి షేర్ బహదూర్ థాపా ఏర్పాటు చేశారు. హుమ్లాలోని నమ్ఖా మున్సిపాలిటీలోని లిమి లాప్చా నుంచి హిల్సా వరకు నేపాల్-చైనా సరిహద్దు వివాదాన్ని ఈ కమిటీ దర్యాప్తు చేయనున్నది.
ఇవి కూడా చదవండి..
సిద్ధూ-చన్నీ భేటీ షురూ! హైకమాండ్ నుంచి దూత..
అహ్మదాబాద్‌లో గుంతలు పూడ్చిన ఖర్చు రూ.693 కోట్లు!
ట్యునీషియాలో ప్రభుత్వ ఏర్పాటుకు తొలిసారి మహిళకు అవకాశం
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన నైజీరియా నటుడు
రిటైర్మెంట్ ప్రకటించిన డ్రాగ్ ఫ్లికర్
గుండెపోటు ఎప్పుడు వస్తుందో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

