Navjyot Singh Sidhu : పదవి ఉన్నా లేకున్నా రాహుల్, ప్రియాంక వెంటే : సిద్ధూ
Navjyot Singh Sidhu : తాను ఏ పదవిలో ఉన్నా, లేకపోయినా పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి అండగా ఉంటానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ...

న్యూఢిల్లీ : (Navjyot Singh Sidhu) తాను ఏ పదవిలో ఉన్నా, లేకపోయినా పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి అండగా ఉంటానని నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. కాంగ్రెస్ పంజాబ్ శాఖలో నెలకొన్న రాజకీయ గందరగోళం మధ్య సిద్ధూ శనివారం మాట్లాడారు. పంజాబ్ పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన సిద్ధూ.. గాంధీ జయంతి సందర్భంగా తన మనుసులోని భావాలను ట్వీట్ చేశారు.
‘గాంధీజీ, శాస్త్రి జీ సూత్రాలను పాటిస్తా. పదవి ఉన్నా, లేకపోయినా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీకి అండగా నిలుస్తా. ప్రతికూల శక్తులు నన్ను ఓడించడానికి ప్రయత్నించినా.. ప్రతి ఔన్స్ పాజిటివ్ ఎనర్జీ పంజాబ్ గెలిచేలా చేస్తుంది. పంజాబియత్ (యూనివర్సల్ బ్రదర్హుడ్) గెలుస్తుంది. ప్రతి పంజాబీ గెలుసాడు!!’ అని సిద్ధూ ట్వీట్ చేశాడు. ఇటీవల క్యాబినెట్ బెర్తుల కేటాయింపులు, డీజీపీ, అడ్వకేట్ జనరల్ నియామకంపై పార్టీ గుర్రుగా ఉన్న సిద్ధూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అమరీందర్ సింగ్-సిద్ధూ మధ్య పోరాటం తీవ్రమైన అనంతరం, అమరీందర్ స్థానంలో చరంజీత్ చన్నీని ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. సిద్ధూ రాజీనామా పార్టీని అల్లకల్లోలం చేసిన తర్వాత, సిద్ధూతో చన్నీ భేటీ అయి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి పార్టీ సమన్వయ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. సిద్ధూని కూడా ఈ ప్యానెల్లో భాగం చేశారు. అయితే, పీపీసీసీ చీఫ్ పదవికి చేసిన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు మాత్రం సిద్ధూ ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి..
బరువు తగ్గించుకోవాలంటే రోజుకు ఎన్ని అడుగులు వేయాలి?
చైనా సైన్యంలో పాక్ అధికారుల రహస్య మోహరింపు.. ఎందుకంటే?
ఖట్టర్ నివాసం వద్ద రైతుల ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు
తాలిబాన్ అణిచివేతకు అమెరికా బిల్లు.. లక్ష్యం మాత్రం పాకిస్తాన్!?
హిమపాతంలో చిక్కుకున్న నేవీ సిబ్బంది.. గాలింపు ముమ్మరం
ఈ గడ్డపై పుట్టిన ఈ ఇద్దరు మహనీయులు అమరులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

