ప్రతి ఓటరు ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపడంలో భాగస్వాములు కావాలన్నారు.
- ఎస్ఐఆర్ ప్రక్రియలో పటాన్చెరును రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలుపుదాం
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పిలుపు
పటాన్చెరు టౌన్, జూలై 26: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరును రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపడంలో భాగస్వాములు కావాలన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో వివిధ రాష్ర్టాలకు చెందిన ఓటర్లు, కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఎస్ఐఆర్పై ఆయన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతాల అభివృద్ధిలో ఓటు హక్కు చాలా అవసరమన్నారు. ఓటు ఉంటేనే ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు. పటాన్చెరు భవిష్యత్‌కు ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరున్న పటాన్చెరు నియోజకవర్గంలో వివిధ రాష్ర్టాల ప్రజలు ఉపాధి కోసం ఇక్కడే నివసిస్తూ ఓటు హక్కు పొందారన్నారు. కులం, మతం ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని, అన్ని రాష్ర్టాల ప్రజలు పండుగలను కలిసిమెలిసి జరుపుకుంటూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరును నిలుపుతున్నారన్నారు.
అనంతరం వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రతినిధులు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాయికోటి రాజును ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్‌యాదవ్, మెట్టు కుమార్‌యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, నాయకులు దశరథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అంతిరెడ్డి, రామచంద్రారెడ్డి, నర్రా భిక్షపతి, పృథ్వీరాజ్, వివిధ రాష్ర్టాల ప్రజలు, కార్మికులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

