సుగి విజయ్, జుప్సీ భద్ర, హారిక రాజేందర్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథ ‘ఐ హేట్ మ్యారేజ్’. పరమేశ్ రేణుకుంట్ల దర్శకుడు. దయానంద్ మాదం, కార్తీక్ వెంపటి నిర్మాతలు. అక్టోబర్ చివరివారంలో సినిమా విడుదల కానున్నది. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ‘అప్పుడే పెళ్లా?..’ అంటూ సాగే పాటను సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో విడుదల చేశారు.
ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ పాటను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. కంటెంట్‌తోపాటు ఎమోషన్స్ ఉన్న సినిమా ఇదని, ఇందులో యువతకు సందేశం కూడా ఉందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. జెన్‌జీ బ్యాచ్‌కి కనెక్టయ్యే సినిమా ఇదని దర్శకుడు చెప్పాడు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: వరికుప్పల యాదగిరి.