Farmers agitation : ఖట్టర్ నివాసం వద్ద రైతుల ఆందోళన, ఉద్రిక్త పరిస్థితులు
Farmers agitation : వరి కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హర్యానా ముఖ్యమంత్రి...

ఛండీగఢ్ : (Farmers agitation) వరి కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసం వరకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు రైతులు ప్రయత్నించగా.. పోలీసులు వాటర్ కానన్లను ఉపయోగించి చెదరగొట్టారు. కర్నాల్ జిల్లా కేంద్రంలో కూడా పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనకు దిగారు.
హర్యానాలో వరి కొనుగోళ్లు ఆలస్యం అయ్యాయి. దీనిని నిరసిస్తూ రైతులు కదం తొక్కారు. ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో రైతులు కదిలివచ్చారు. అయితే, వీరిని కొంత దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రైతులు ఘర్షణకు దిగారు. బారికేడ్లను తొలగించుకుని ముందుకు వచ్చేందుకు రైతులు ప్రయత్నించారు. పరిస్థితి చేజారి పోకుండా ఉండేందుకు పోలీసులు వాటర్ కానన్లను ఉపయోగించి నిసరనకారులను చెల్లాచెదురు చేశారు. పలువురు రైతులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అసీమ్ గోయల్ నివాసం వెలుపల కూడా నిరసనకారులు ఆందోళనకు దిగారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పరిపక్వత ఆలస్యం కావడంతో పంజాబ్, హర్యానాల్లో ఖరీఫ్ వరి సేకరణను కేంద్రం అక్టోబర్ 11 వరకు వాయిదా వేసింది. ప్రస్తుతం తాజా పంటలో తేమ శాతం అనుమతించదగిన పరిమితికి మించి ఉన్నదని కూడా పేర్కొన్నది. దాంతో వరి కొనుగోళ్లను వాయిదా వేశారు. పంజాబ్‌లో 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం వరి సేకరణ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాగా, హర్యానాలో సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కావాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

