(Hindi in UN) ప్రపంచ దేశాలు సభ్యులుగా ఉన్న ఐక్యరాజ్య సమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చరిత్ర సృష్టించారు. ఇది జరిగి ఇవ్వాల్టికి సరిగ్గా 44 ఏండ్లు పూర్తయ్యాయి. వాజపేయి ప్రసంగం పూర్తవగానే సమావేశానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు. ఇది ఐక్యరాజ్య సమితి చరిత్రలో చిరస్థాయిగా నిలిపోనున్నది.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 32 వ సెషన్లో భారతదేశం తరపున భారత విదేశాంగ మంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజపేయి హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయనకు ఇదే మొదటి ప్రసంగం. అతను హిందీలో తన ప్రసంగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఒక నాయకుడు హిందీలో ప్రసంగించడం యూఎన్ చరిత్రలో ఇదే మొదటిసారి. వాజపేయి ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడుతారు. కానీ హిందీని ప్రోత్సహించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మొదటిసారిగా, భారతదేశం అధికారిక భాష యూఎన్ వేదికపై వినిపించింది.
అణు నిరాయుధీకరణ, ప్రభుత్వ ప్రాయోజిత తీవ్రవాదం, ప్రపంచ సంస్థల సంస్కరణల వంటి ముఖ్యమైన సమస్యలపై భారతదేశం వైపు నుంచి సమర్థంగా మాట్లాడారు. ‘వసుదైక కుటుంబకం అనే భావన చాలా పాతది. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అనే నమ్మకాన్ని మేం విశ్వసిస్తున్నాం’ అని వాజపేయి చెప్పారు. దాదాపు 3 నిమిషాల పాటు ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగియగానే సమావేశానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు లేచి నిలబడి వాజపేయికి చప్పట్లతో అభినందించారు.
2012 : ఫార్ములా వన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన మైఖెల్ షూమాకర్
2006 : వికీలిక్స్ వెబ్సైట్ను ప్రారంభించిన జూలియన్ అసాంజే
1963 : క్యూబా, హైతీలో తుపాను, 6 వేలకు పైగా జనం దుర్మరణం
1957 : స్పుత్నిక్-1 ను పరీక్షించిన సోవియట్ యూనియన్
1830 : నెదర్లాండ్స్ నుంచి విడివడి కొత్త దేశంగా ప్రకటించుకున్న బెల్జియం
1824 : రిపబ్లిక్గా మారిన మెక్సికో
1582 : జార్జియన్ క్యాలెండర్ను అనుసరించాలని నిర్ణయించిన ఇటలీ, పోలాండ్, పోర్చుగల్
ఈ గాజు మహా బలమైనది.. ఫోన్ స్క్రీన్లుగా వస్తే పగిలే సమస్య ఉండదంట!
సరిహద్దులో తాలిబాన్ ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..