Oil spill in America : అమెరికాలో పైప్‌లైన్ లీక్.. సముద్రంలో భారీగా చమురు తెట్టు
Oil spill in America : అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా చమురు సముద్రం పాలైంది. దాంతో పెద్ద ఎత్తున చమురు తెట్టు...

వాషింగ్టన్ : (Oil spill in America) అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో పైప్ లైన్ లీక్ కావడంతో భారీగా చమురు సముద్రం పాలైంది. దాంతో పెద్ద ఎత్తున చమురు తెట్టు రావడంతో సముద్రంలో చేపటలతో పాటు పలు పక్షలు మృత్యువాతకు గురయ్యాయి. పెద్ద ఎత్తున ఆయిల్ లీక్ కావడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు వేల బారెల్స్ ఆయిల్ లీక్ అయినట్లుగా అధికారులు గుర్తించారు.
దక్షిణ కాలిఫోర్నియాలోని పైప్ లైన్ లీక్ కావడంతో ఆరెంజ్ కౌంటీ తీరంలో చమురు పెద్ద ఎత్తున సముద్రంలో చేరింది. పసిఫిక్ మహాసముద్రంలో దాదాపు 3,000 బారెల్స్ చమురు లీక్ అయ్యినట్లు హంటింగ్టన్ మేయర్ కిమ్ కార్ ధ్రువీకరించారు. చమురు తెట్టు కారణంగా చేపలు, కొన్ని రకాల పక్షులు చనిపోయాయి. లీక్ కారణంగా దాదాపు 18 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ప్రభావితమైందని గుర్తించారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో చేపల వేటను కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ నిలిపివేసింది. చమురు తెట్టును తొలగించేందుకు సిబ్బంది రంగప్రవేశం చేశారు. ఈ సంఘటన పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లేలా చేస్తుందని అధికారులు చెప్పారు.
చమురు లీక్ అయిన పైప్‌లైన్‌ను వెంటనే మూసివేసినట్లు యాంప్లిఫై ఎనర్జీ సీఈఓ మార్టిన్ విల్షర్ తెలిపారు. లీక్ ఎక్కడ, ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాలిఫోర్నియా రాష్ట్ర, స్థానిక సంస్థలు కోస్ట్ గార్డ్‌తో కలిసి చమురు ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రపరుస్తున్నాయి. స్థానిక సెనేటర్ మిచెల్ స్టీల్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సంఘటనను విపత్తుగా ప్రకటించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి..
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్‌కతాలో కొత్త సంప్రదాయం
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
అభివృద్ధిలో అనుసంధానత పాత్ర కీలకం : వెంకయ్యనాయుడు
70 శాతం వయోజనులకు అందిన తొలి డోసు : మాండవీయ
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

