Hydrophobic Cotton : నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
Hydrophobic Cotton : ఐఐటీ గువాహటి పరిశోధకులు వినూత్న అబ్జార్బర్‌ను కనిపెట్టారు. దీని ద్వారా భవిష్యత్‌లో సముద్రంలో ఒలికే చమురును తేలికగా వేరు చేయవచ్చునని అభయమిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను...

(Hydrophobic Cotton) ఓడలు ప్రమాదానికి గురైన సందర్భాల్లో వాటిలో రవాణా చేసే చమురు సముద్రం పాలవడం మనం చూస్తుంటాం. ఈ చమురు సముద్రంలో కాలుష్యాన్ని వెదజల్లి జలచరాలను నాశనం చేస్తుందని పర్యావరణ వేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీరి భయాలను పటాపంచలు చేస్తూ ఐఐటీ గువాహటి పరిశోధకులు వినూత్న అబ్జార్బర్‌ను కనిపెట్టారు. దీని ద్వారా భవిష్యత్‌లో సముద్రంలో ఒలికే చమురును తేలికగా వేరు చేయవచ్చునని అభయమిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఇటీవలి అమెరికన్ కెమికల్ సొసైటీకి చెందిన ప్రముఖ పీర్-రివ్యూ జర్నల్ ‘ఏసీఎస్ అప్లైడ్ మెటీరియల్స్ అండ్ ఇంటర్ఫేస్’ లో ప్రచురితమైంది.
నీటిని కాకుండా కేవలం నూనెను మాత్రమే పీల్చుకునే వినూత్న హైడ్రోఫోబిక్ కాటన్ కాంపోజిట్‌ను ఐఐటీ గువాహటి పరిశోధకులు సృష్టించారు. భవిష్యత్‌లో చమురు చిందటం వంటి పర్యావరణ సంక్షోభ పరిస్థితులను పరిష్కరించడానికి దీనిని ఉపయోగించవచ్చు. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (ఎంఓఎఫ్) కలిగిన అత్యంత పోరస్, నీటిని వికర్షించే సూపర్ హైడ్రోఫోబిక్ కాటన్ కాంపోజిట్ మెటీరియల్.. చమురు-నీటి మిశ్రమం నుంచి చమురును వేరుచేస్తుంది.
ఈ కాటన్ అబ్జార్బర్.. చమురు రవాణా సమయంలో సముద్రంలో ఒలికిపోయిని చమురును ఒద్దికగా నీటి నుంచి వేరుచేసేందుకు అవకాశాలు ఉన్నాయని పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ శ్యాం పీ బిశ్వాస్ చెప్పారు. రసాయనాలు, నూనె సాంద్రతతో సంబంధం లేకుండా విభజన సామర్థ్యం 95-98 శాతం మధ్య ఉంటుందని తెలిపారు. ఈ కాటన్ అబ్జార్బర్‌ను కనీసం 10 సార్లు తిరిగి వాడేందుకు వీలుంటుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే సముద్రాల్లో పడిపోయి తెట్టుగా మారిన నూనెను తేలికగా బయటకు తీసి పర్యావరణాన్ని కాపాడవచ్చునని అభయమిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్‌కతాలో కొత్త సంప్రదాయం
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
అభివృద్ధిలో అనుసంధానత పాత్ర కీలకం : వెంకయ్యనాయుడు
70 శాతం వయోజనులకు అందిన తొలి డోసు : మాండవీయ
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

