Eye reveals : గుండె ఆరోగ్యాన్ని కంటితో తెలుసుకోవచ్చు.. అమెరికా పరిశోధన
Eye reveals : కండ్లు మన శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. చూపును ప్రసాదించేవే కాకుండా మనలో వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా ఇట్టే పట్టేస్తాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పరిశోధకులు...

(Eye reveals) కండ్లు మన శరీరానికి ఎంతో ముఖ్యమైనవి. చూపును ప్రసాదించేవే కాకుండా మనలో వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా ఇట్టే పట్టేస్తాయి. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. కంటిని స్కాన్ చేయడం ద్వారా గుండె ఆరోగ్యం గురించి విషయాలను చెప్పొచ్చంటున్నారు. కంటిలోని రక్తప్రసరణ వ్యవస్థ ఆధారంగా పలు వ్యాధులను గుర్తించవచ్చునని సెలవిస్తున్నారు.
సాధారణ కంటి పరీక్ష గుండె జబ్బు ప్రమాదాన్ని తెలియజేస్తుంది. ఈ పరీక్షలో మనిషికి గుండె జబ్బుతో పాటు పక్షవాతం వచ్చే ప్రమాదం ఎంత ఉన్నదో కూడా తెలుసుకోవచ్చు. అమెరికన్ పరిశోధకులు కంటి రెటీనాను పరిశీలించడం ద్వారా కంటిలో రక్త ప్రసరణ ఎంత తక్కువగా ఉన్నదో చెప్పవచ్చంటున్నారు. ఇదే విషయం గుండె జబ్బులను కూడా సూచిస్తుందంట.
యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో దీనికి సంబంధించిన నివేదికను సిద్ధం చేశారు. శరీరంలో రక్త ప్రసరణ తగ్గినప్పుడు లేదా తగినంతగా లేనప్పుడు.. అది కంటిలోని రెటీనా కణాలను కూడా ప్రభావితం చేస్తుంది. వీరి పరిశోధన ప్రకారం, రెటీనాను పరీక్షించడం ద్వారా స్కీమియా అనే గుండె జబ్బును గుర్తించవచ్చు. స్కీమియా పరిస్థితిలో ఉన్నప్పుడు శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. ధమనులు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిశోధన ద్వారా భవిష్యత్‌లో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చునని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో రెటీనా సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాథ్యూ బెక్హాం అభిప్రాయపడుతున్నారు. రెటీనా పరీక్షలో స్కీమియా లక్షణాలను చూపించే రోగులను కార్డియాలజిస్టుల వద్దకు పంపాలని ఇక్కడి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు.
పరిశోధన ఇలా సాగింది..
రెటీనా నుంచి కంటి వ్యాధులను అర్థం చేసుకునేందుకు పరిశోధకులు 13,940 మంది రోగులపై పరిశోధన జరిపారు. వీరి కంటి రెటీనాలను 2014 జూలై-2019 జూలై మధ్య పరీక్షించారు. ఈ పరీక్షలో 84 మందిలో గుండె జబ్బు నిర్ధారణ అయింది. ఈ 84 మందిలో నిజంగానే 58 మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. 26 మంది రోగులకు స్ట్రోక్‌కు గురయ్యారు. ఈ రెండు వ్యాధులు కూడా రక్తప్రసరణకు సంబంధించినవే కావడం విశేషం.
ఇవి కూడా చదవండి..
అమెరికాలో పైప్‌లైన్ లీక్.. సముద్రంలో భారీగా చమురు తెట్టు
నీటిలో ఒలికిన నూనెను వేరుచేసే హైడ్రోఫోబిక్ కాటన్.. ఐఐటీ గువాహటి పరిశోధకుల కృషి
అమ్మల చేతితో అమ్మకు పూజలు.. కోల్‌కతాలో కొత్త సంప్రదాయం
గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన జెఫ్ బెజోస్ ‘బ్లూ ఆరిజిన్’
అభివృద్ధిలో అనుసంధానత పాత్ర కీలకం : వెంకయ్యనాయుడు
70 శాతం వయోజనులకు అందిన తొలి డోసు : మాండవీయ
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SDRF | వరదలో గల్లంతైన 11 మంది సేఫ్.. బేతుపల్లి చెరువు వద్ద తెల్లవారు జామున లభించిన ఆచూకీ
IT Raids | పోలీసు అధికారి సంకిరెడ్డి భీంరెడ్డి బినామీ ఆస్తులపై ఐటీ చర్యలు!
BRS | అన్నీ పార్టీల చూపు గులాబీ వైపు.. బీఆర్ఎస్ పార్టీలో చేరికల హోరు
RR Tax | ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్యలేవి..? చోటేభాయ్పై చర్యలకు బడేభాయ్కి ధైర్యం లేదు : కేటీఆర్
Kodangal | సీఎం సభ కోసం చెరువు ఖాళీ..! కొడంగల్‌లో కాంగ్రెస్ తెస్తున్న కరువుకు నిదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

