ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 20, 2020 , 12:10:00

అమితాబ్ మూవీ రిలీజ్‌పై కూక‌ట్‌ప‌ల్లి కోర్టు స్టే !

అమితాబ్ మూవీ రిలీజ్‌పై కూక‌ట్‌ప‌ల్లి కోర్టు స్టే !

కూక‌ట్ ప‌ల్లి సెష‌న్స్ కోర్టు బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమా విడుద‌లపై స్టే విధించింది. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో జుంద్ చిత్రాన్ని డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలో కానీ, సినిమా థియేట‌ర్ల‌లో కాని త‌దుప‌రి నోటీసులు వ‌చ్చే వ‌ర‌కు  విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని సెష‌న్స్ కోర్టు నిర్దేశించింది. ముంబై స్ల‌మ్ ఏరియా వాసి ఫుట్ బాల్ అఖిలేశ్ పాల్ కోచ్ స్థాయికి ఎలా చేరుకున్నార‌న్న క‌థాంశంతో, ఆయ‌న జీవితక‌థ ఆధారంగా ఈ మూవీని నాగ‌రాజ్ మంజులే డైరెక్ట్ చేశాడు.

అఖిలేశ్ పాల్ జీవితం ఆధారంగా రాను్న ఈ సినిమాను  తీసేందుకు కావాల్సిన హ‌క్కుల‌ను తాను సొంతం చేసుకున్నాన‌ని నంది చిన్నికుమాఱ్‌ అనే  కొత్త ఫిల్మ్  మేక‌ర్ సెష‌న్స్ కోర్టును ఆశ్ర‌యించాడు. స్ల‌మ్ సాస‌ర్ అనే పేరుతో ఈ సినిమా ఇప్ప‌టికే తాను మొద‌లుపెట్టాన‌ని చెప్తున్న నందిచిన్నికుమార్ జుంద్ డైరెక్ట‌ర్, నిర్మాత‌ల‌పై కేసు పెట్టారు. ఈ పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు జుంద్ విడుద‌ల‌పై స్టే విధించింది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.