కొయంబత్తూర్: మక్కల్ నీధి మయ్యిం పార్టీ చీఫ్, ఫిల్మ్ స్టార్ కమల్ హాసన్ లీడింగ్‌లో ఉన్నారు. కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. తమిళనాడులో తాజా సమాచారం ప్రకారం డీఎంకే 118 స్థానాల్లో, అన్నాడీఎంకే 91 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్ మురుగన్ ధర్మపురం నుంచి పోటీ చేశారు. ఆయన అక్కడ ఆధిక్యంలో ఉన్నారు. అయితే రెండవ రౌండ్ కౌంటింగ్ ముగిసే సమయానికి కమల్ వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మయూర్ జయకుమార్ ఆధిక్యంలో ఉన్నారు.