రాజా వారు-రాణీగారు, ఎస్ఆర్ కల్యాణ మండపం (SR Kalyanamandapam) చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ (Clap entertainments), మైత్రీ మూవీమేకర్స్ (Mythri Movie Makers) సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రముఖ దర్శకులు కేఎస్ రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేనిల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబి) కెమెరా స్విచ్చాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ క్లాప్ నిచ్చారు. మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు. నిర్మాతలు నవీన్ యేర్నేని, రవిశంకర్, చిరంజీవి (చెర్రీ)లు దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు.
ఈ చిత్రానికి కెమెరా: వెంకట్.సి.దిలీప్, ప్రొడక్షన్ డిజైనర్: జేవీ, సంభాషణలు: రమేష్ కాదూరి, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్ కంట్రోలర్: సురేష్ కందుల. కథ-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రమేష్ కాదూరి.
రాజా వారు-రాణీగారు, ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా సోమవారం హైదరాబాద్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. @Kiran_Abbavaram pic.twitter.com/R7jRmisqvC
— Namasthe Telangana (@ntdailyonline) November 29, 2021
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్