Gaddipotharam | మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ బోణీ కొట్టింది. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా.. 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మూడు వార్డులు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందారు.