టాలీవుడ్ హీరో చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఆచార్య (Acharya). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో సిద్ధ పాత్ర (#SiddhasSaga)లో కనిపించబోతున్నాడు రాంచరణ్ (Ramcharan). మేకర్స్ ఇవాళ సిద్ద సాగా టీజర్‌ను విడుదల చేశారు.
ధర్మస్థలికి ఆపదొస్తే..అది జయించడానికి ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుతుంది..అంటూ సిద్ధ రోల్లో రాంచరణ్ చెప్తున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాంచరణ్ పాల్గొన్న యాక్షన్ సన్నివేశాలు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తున్నాయి. టీజర్ చివరలో సెలయేరుకు అవతలివైపు చిరుత ఠీవిగా నడుచుకుంటూ వెళ్తున్న..ఇవతలివైపు చిరు, చరణ్ దాన్ని సీరియస్‌గా చూస్తున్నారు. టీజర్ చూస్తుంటూ నక్సలిజం బ్యాక్ డ్రాప్ అంశాలు, ఇతర విషయాల చుట్టూ తిరిగే కథాంశంతో ఆచార్య తెరకెక్కుతోంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిరు, కాజల్ పై వచ్చే లాహే లాహే పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. మరోవైపు రాంచరణ్, పూజాహెగ్డేపై వచ్చే నీలాంబరి పాటకు కూడా మంచి స్పందన వస్తోంది. ఆచార్య థియేటర్లలో 2022 ఫిబ్రవరి 4న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
#SiddhasSaga Teaser out now 🔥
— Ram Charan (@AlwaysRamCharan) November 28, 2021
▶️ https://t.co/k0tlj3HDyd#Acharya #AcharyaOnFeb4th
Megastar @KChiruTweets #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro @adityamusic