ఓట్ల లెక్క చూపించండి.. డిమాండ్ చేస్తున్న రవి ఫ్యాన్స్..

anchor ravi eliminated | బిగ్ బాస్ 5 తెలుగు నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడనే విషయం సోషల్ మీడియాలో ధారాళంగా వ్యాపించింది. ఒకరోజు ముందుగానే షూటింగ్ పూర్తయిపోతుంది.. కాబట్టి కచ్చితంగా ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుంది. పైగా ప్రతిసారి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో శనివారమే తెలుస్తోంది. ఈసారి కూడా ఇదే జరిగింది. యాంకర్ రవి ఇంటి నుంచి వెలువడుతున్న సంగతి ముందుగానే బయటికి వచ్చేసరికి రవి ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. కావాలనే రవిని ఇంటి నుంచి బయటకు పంపేశారని.. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌కు ప్రియాంక సింగ్, కాజల్ కంటే తక్కువ ఓట్లు ఎలా పడతాయి.. మీరు ఓట్ల లెక్క చూపించండి.. అప్పుడే మేము నమ్ముతాము లేదంటే యాంకర్ రవిని కావాలని ఎలిమినేట్ చేశారనే విషయం నిజమే అని అందరికీ తెలుస్తుంది అంటున్నారు రవి ఫాలోవర్స్.
యాంకర్ రవి టాప్ 5 లో ఉంటాడని హౌస్‌లోకి వచ్చిన కంటెస్టెంట్లతో పాటు బయట ప్రేక్షకులు కూడా అంచనా వేశారు. అలాంటి కంటెస్టెంట్ ఇంత సడన్‌గా ఎలా ఎలిమినేట్ అవుతాడు.. ఇందులో ఏదో తిరకాసు ఉంది అంటున్నారు. ఈ అనుమానాలను పోవాలి అంటే స్టార్ మా యాజమాన్యం బిగ్ బాస్ ఓట్ల లెక్క చూపించాల్సిందే. అలా చూపించకపోతే యాంకర్ రవి ఎలిమినేషన్ విషయంలో అన్యాయం జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం ఉన్నట్లే అంటున్నారు నెటిజన్స్. ఈ వారం ఎలిమినేషన్లో చివరి వరకు కాజల్ , రవి ఉంటారని.. చివర్లో కాజల్ సేవ్ అయిపోయి రవి ఇంటి నుంచి వచ్చేస్తాడని తెలుస్తోంది. మరి దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఏమంటారో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
గత సీజన్ లో మోనల్ గజ్జర్.. ఈ సీజన్లో ప్రియాంక సింగ్
Shanmukh: ఎట్టకేలకు ప్రేయసి ఎంట్రీ.. ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయిన షణ్ముఖ్
Siri: చేసిన తప్పుకి కుమిలిపోయి గుంజీలు తీసిన సిరి
Bigg Boss: ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం హౌజ్‌మేట్స్ ఏమేం త్యాగాలు చేశారో తెలుసా?
ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో మోస్ట్ షాకింగ్ ట్విస్ట్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

