Priyanka singh | మోనల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుడిగాడు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ సీజన్ 4తో మంచి గుర్తింపును సంపాదించుకుంది. బయటికి వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది ఈమె. తన సొంత భాష గుజరాతిలో కూడా వరుస సినిమాలు చేస్తుంది మోనల్. అన్నింటికీ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్‌తో ఈమె లవ్ ట్రాక్ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. సీజన్ 4 లో ఇద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు.
కేవలం ఈ లవ్ స్టోరీ కారణంగానే టాప్ 6 లోకి వచ్చింది మోనల్ గజ్జర్. గత సీజన్లో ప్రతి వారం ఈమె సేవ్ అవుతుంటే బిగ్‌బాస్ దత్తపుత్రిక అంటూ ఈమెకు పేరు కూడా పెట్టారు ఆడియన్స్. ఇక ఈ సీజన్లో కూడా బిగ్ బాస్‌కు ఒక దత్త పుత్రిక ఉంది. ఆమె ఎవరో కాదు ప్రియాంక సింగ్. ఆట పరంగా చూసుకుంటే చాలా మంది కంటే ఈమె వీక్ కంటెస్టెంట్. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. నామినేషన్ల సమయంలో తను వీక్ అనే విషయం కూడా ఒప్పుకుంది ప్రియాంక. అయినా కూడా ఇన్ని రోజులు ఇంట్లో ఎలిమినేట్ అవ్వకుండా వస్తుంది. 12 వారాలు గడిచిన తర్వాత కూడా విజయవంతంగా ఈమె జర్నీ కొనసాగుతుంది.
ఈ వారం కచ్చితంగా ఆమె ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా మరోసారి సేవ్ అయింది ప్రియాంక. ఆమె కంటే ఎన్నో రెట్లు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న యాంకర్ రవి ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. ఇది చూసిన తర్వాత ప్రియాంక సింగ్ కు నిజంగానే ఓట్లు పడుతున్నాయా.. లేదంటే సేవ్ చేయడానికి కావాలని వేస్తున్నారా అనే విషయం అర్థం కావడం లేదు. గత సీజన్లో మోనల్ గజ్జర్ పై ఈ విషయంలో వచ్చిన అనుమానాలు ఇప్పుడు ప్రియాంక సింగ్ విషయంలోనూ వస్తున్నాయి. మొత్తానికి ఈమె జర్నీ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో మోస్ట్ షాకింగ్ ట్విస్ట్..
Ramya Krishna: కమల్ దూరం కావడంతో బిగ్ బాస్ హోస్ట్‌గా ఫైర్ బ్రాండ్..!
Siri: సిరి తల్లి అన్న మాటలను తన తల్లికి చెప్పుకున్న షణ్ముఖ్
Ravi: రవికి అంత సీన్ లేదని అనేసిన ఆయన భార్య
Shanmukh: ఈ విషయం మీ అమ్మకు చెప్పు అంటూ సిరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షణ్ముఖ్