సన్నీ మదర్ వెళ్లి పోయాంక ప్రియాంక సింగ్ సోదరి మధు ఇంట్లోకి అడగుపెట్టారు. ఆమె వచ్చీరావడంతోనే నాన్నగురించి అడిగింది. అయితే నాన్నకు కళ్ల ప్రాబ్లమ్ ఉంది కాబట్టి రాలేదని బదులిచ్చింది మధు. నాన్న తల దించుకునే పని చేయనన్నావు, ఆ మాట నిలెబట్టుకో. గేమ్‌పై మాత్రమే ఫోకస్ చేయమని చెప్పింది. ఇక రవి ఫ్యామిలీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ముందుగా భార్య నిత్య రాగా, వియా రాలేదా అంటూ ఎమోషనల్ అవుతాడు. ఎంతో ట్రై చేశాను. కానీ కుదరలేదు అని అంటుంది.
ఇంతలోనే వియా వాయిస్ వినిపించడంతో పరుగెత్తుకుంటూ వస్తాడు రవి. మిగతా హౌజ్‌మేట్స్ కూడా వియాని చూసి చాలా సంతోషిస్తారు. అయితే నిత్య తన భర్తకు పలు సూచనలు చేసింది. అంతా బాగుంది.. ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు.. నువ్ వెళ్లే ముందు చెప్పావ్ కదా? ఏడ్వాల్సి వస్తుంది అని అలానే జరుగుతోంది. కొంచెం అదే బాధగా ఉంది అని నిత్య అంటుంది.
ఇక నిత్య ఏడుస్తుండటంతో.. వియా కూడా ఏడ్చేస్తుంది. తన పాపను రవి ఊకోబెడతాడు. ఇళ్లంతా చూపిస్తాడు. మోజ్ రూంలోకి తీసుకెళ్తాడు. రవిని ఇంఫ్లూయెన్స్ అంటారు కానీ అక్కడ అంత లేదని నిత్య అనడంతో షన్ను, సిరి నవ్వేస్తారు. నీకు ఎన్ని పేర్లు పెట్టారో అందరికీ తెలుసు. కానీ అవేమీ నిన్ను ఎఫెక్ట్ చేయలేదు. నువ్వెంటో అందరికీ తెలుసు. నీకు ఎంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. ప్రస్తుతం ఉన్నఈ టైంను ఎంజాయ్ చేయ్.. నీకు ఏదైనా గుర్తుండకపోతే.. వదిలేయ్.. మరిచిపోయాను అని చెప్పు.. అంతే కానీ ఎక్స్ ప్లెయిన్ చేయకు అని చెప్పేసింది. వెళ్లే ముందు వియా కన్నీరు పెట్టుకోవడంతో అందరు చాలా బాధపడ్డారు.