Ramya Krishna: కమల్ దూరం కావడంతో బిగ్ బాస్ హోస్ట్‌గా ఫైర్ బ్రాండ్..!

ఇదే నా మాట.. నా మాటే శాసనం అంటూ రమ్యకృష్ణ బాహుబలి సినిమాలో ఎంత సందడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత రమ్యకృష్ణ బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైన తెగ సందడి చేస్తుంది. అన్ని పాత్రలకు ఈమె బెస్ట్ చాయిస్‌గా మారుతుంది. అయితే తమిళంలో బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్‌గా సాగుతుండగా, ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న కమల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చెన్నై తిరిగి వచ్చాక కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో క్వారంటైన్లో ఉన్నారు.
కమల్ కొన్నాళ్లు షోకి అందుబాటులో ఉండని నేపథ్యంలో ఆయన స్థానంలో కమల్ కూతురు శృతి హాసన్ వస్తుందని అందరు భావించారు. కాని తాజా సమాచారం రమ్యకృష్ణ పేరు వార్తలలోకి వచ్చింది. తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4ను రమ్యకృష్ణ ఆల్రెడీ ఓసారి హోస్ట్ చేశారు. నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్‌లో లేనప్పుడు రమ్యకృష్ణనే సదరు షోను నడిపించారు. అలాగే తమిళంలో పలు షోలను హోస్ట్ చేసిన అనుభవం కూడా రమ్యకృష్ణకు ఉంది. ఈ క్రమంలోనే ఆమెతో షో చేయించాలని అనుకుంటున్నారట. కమల్ హాసన్ వచ్చే వరకు రమ్యకృష్ణతోనే షో రన్ చేయాలని నిర్వాహకులు భావించారట. దానికి రమ్యకృష్ణ కూడా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

