Ravi: తల్లిని చూసి చిన్నపిల్లాడిలా ఏడ్చిన రవి.. హౌజ్‌లో ఎలా ఉంటుందో తెలుస్తుందా అంటూ శివ బాలాజీ చురక

శనివారం ఎపిసోడ్లో నాగార్జున ఇంటి సభ్యులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. మరి కొంతమంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఈ రోజు రాబోతున్నారు. కాని వారిని చూడాలన్నా, మాట్లాడాలన్నా ఓ త్యాగం చేయాల్సి ఉంటుంది అంటూ ‘బంధానికి త్యాగం’ అనే టాస్క్ ఆడించారు. మొదటిగా యాంకర్ రవితో మొదలుపెట్టారు. అయితే రవి కూతురు ముద్దు ముద్దు మాటలు నాగార్జునని కూడా ఆకట్టుకున్నాయి. చాలా క్యూట్‌గా ఉందని ప్రశంసలు కురిపించాడు.
ఇక రవి.. తన కూతురు గుర్తుగా ఉంచుకున్న డాల్ని త్యాగం చేశాడు. ఆ త్యాగం ఇంటి సభ్యులందరూ ఎస్ అని అనడంతో రవి కోసం వచ్చిన గెస్ట్‌ని కలుసుకునే అవకాశం లభించింది. రవి కోసం అతని తల్లి ఉమాదేవి బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చారు. తల్లిని చూసి రవి చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘నువ్ రాజావిరా.. రాజ్ పుత్ రవి రాజా.. నా కొడుకు రవి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.. నువ్ కన్నీళ్లు పెట్టుకోవద్దు’ అని చెప్పింది.
బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివ బాలాజీ కూడా రవి కోసం వచ్చాడు. నువ్ చాలా మంచోడివి.. నీకోసం నువ్ పుట్టావ్.. ఎన్ని వచ్చినా తట్టుకుని ఈ స్టేజ్‌లో ఉన్నా.. బిగ్ బాస్ హౌస్‌లో ఉండటం వేరు.. బయట ఉండటం వేరు.. నువ్ ఎప్పుడూ వేరే వాళ్లకి సపోర్ట్‌గా మాట్లాడొద్దు.. పాయింట్ మాట్లాడేసి వచ్చెసెయ్.. మిగతాది జనం చూసుకుంటారు.. నువ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్.. అని చెప్పాడు. బిగ్ బాస్ లో ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుందా అంటూ అందరు ఇంటి సభ్యులని ఉద్దేశించి అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ ప్లేస్ రవికి ఇచ్చిన శివ బాలాజీ రెండో స్థానం సన్నీకి.. మూడో స్థానం శ్రీరామ్.. నాలుగో స్థానం షణ్ముఖ్.. ఐదో స్థానం మానస్‌లకు ఇచ్చారు. ఇక రవి తల్లి తన కవర్లో ఉన్నకవర్ ఓపెన్ చేయగా, అందులో అన్‌సేఫ్ రావడంతో వారు కాస్త బాధపడ్డారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

