కుటుంబ సభ్యులని, ఫ్రెండ్స్ ని కలిసేందుకు ఏదో ఒక త్యాగం చేస్తూ వచ్చారు ఇంటి సభ్యులు. బిగ్ బాస్ హౌజ్‌లో స్ట్రాంగ్ విన్నర్‌గా ఉన్న షణ్ముఖ్.. తన ప్రేయసి దీప్తి సునయన ఇచ్చిన టీషర్ట్‌ను భారంగా త్యాగం చేశాడు. ఈ త్యాగం తర్వాత ముందుగా షణ్ముఖ్ అన్నయ్య బిగ్ బాస్ స్టేజ్‌పై కనిపించాడు. ఊహించిన వ్యక్తి రాలేదనే బాధలో షణ్ముఖ్ ఉండగా అది గ్రహించాడు ఫణ్ను సోదరుడు. కొద్ది సేపటి తర్వాత దీప్తి కూడా రావడంతో ఆమెని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతూ మురిసిపోయాడు.
ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని దీప్తి సూచించింది. నాకు నువ్వేంటో తెలుసంటూ అతడికి గాలిలో ముద్దులు పంపించింది. ఇక నాగార్జున.. టాప్ 5లో ఎవరు ఉంటారని ప్రశ్నించగా, అందుకు షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీ, రవి, మానస్లు వరుసగా టాప్ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఫినాలేలో కలుద్దామంటూ వీడ్కోలు తీసుకుంది. మొత్తానికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సందడితో షో ఆసక్తికరగా సాగింది.
ఇక ఈ రోజు ఒకరు ఎలిమినేషన్ కానుండగా, అందరు ఊహించని విధంగా రవి పేరు వైరల్‌గా మారింది. రవి ఎలిమినేట్ అవుతాడంటూ గాసిప్ రాయుళ్లు గట్టిగా చెబుతున్నారు. రవి కన్నా వీక్ కంటెస్టెంట్స్ ఉన్నా కూడా రవిని ఎలిమినేట్ చేయడం వెనక పరమార్ధం ఏమైన ఉందా అని వెతుకుతున్నారు.చూడాలి మరి నేటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో..!