బంధానికి త్యాగం అనే టాస్క్‌లో ప్రియాంక తన మేకప్ కిట్ త్యాగం చేసింది. దీంతో ఆమె కోసం హాస్యనటులు సాయి, అప్పారావు వచ్చారు. నన్ను కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి కామెడీ షో చేయించారు.. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరే కారణం అప్పారావు అని చెబుతూ ప్రియాంక ఎమోషనల్ అయింది. వారు ప్రియాంకని విన్నర్‌గా డిసైడ్ చేస్తూ సన్నీ, శ్రీరామ్, రవి, మానస్‌లను టాప్ 5లో ఉంచారు.
ఇక సన్నీ తనకు ఫ్రెండ్స్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను త్యాగం చేయగా ఫ్రెండ్స్ నిఖిల్, వెంకట్ స్టేజీపై సందడి చేశారు. వారు నానా హంగామా చేశారు. అద్భుతంగా ఆడుతున్నావు. అలానే కంటిన్యూ చేయి అంటూ సన్నీని విన్నర్ స్థానంలో ఉంచారు. షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంచారు. ఇక మానస్.. తల్లి పంపిన బ్రేస్‌లెట్‌ను త్యాగం చేయడంతో మానస్ తండ్రి వెంకట్రావు, ఫ్రెండ్ అమర్దీప్ వచ్చాడు.
అమర్ దీప్.. మానస్ గొప్ప తనాన్ని తెలియజేశాడు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే కారణం మానస్ అని అన్నాడు. ఏమీ లేనివాడిని తీసుకొచ్చి అన్నీ ఉన్నవాడిలా చేశాడు అంటూ మానస్‌ను ఫస్ట్ ప్లేస్‌లో సన్నీ, కాజల్, శ్రీరామ్, షణ్ముఖ్‌ను మిగిలిన నాలుగు స్థానాల్లో పెట్టారు. ఇక కాజల్ ఎంతగానో ఇష్టపడే బొమ్మను త్యాగాల పెట్టెలో పడేసింది. ఆమెను కలవడానికి సోదరితో పాటు, సింగర్ లిప్సిక కూడా వచ్చారు.
వీళ్లు కాజల్‌ను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, షణ్ను, శ్రీరామచంద్ర, మానస్‌ను తర్వాతి స్థానాల్లో పెట్టారు. అనంతరం శ్రీరామ్.. హమీదా ఇచ్చిన కానుకను త్యాగం చేయగా అతడి కోసం తల్లి, స్నేహితురాలు వచ్చారు. వీళ్లు శ్రీరామ్, రవి, ప్రియాంక సింగ్, సన్నీ, షణ్ముఖ్‌లు వరుసగా టాప్ 5లో ఉంటారని జోస్యం చెప్పారు.