Krish | అడ్వెంచర్ జానర్లో కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న క్రిష్ .. ఏడుగురు హీరోయిన్లతో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్!
Krish | టాలీవుడ్లో సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను ఏర్పరుచుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది.
Krish | టాలీవుడ్లో సామాజిక సందేశంతో కూడిన చిత్రాలు తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను ఏర్పరుచుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ఎప్పుడూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. కథలో బలం, భావోద్వేగం, విజువల్ ట్రీట్ అన్నీ కలిపి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో క్రిష్‌కు మంచి పేరు ఉంది. అయితే గత ఏడాది విడుదలైన ఆయన చిత్రం ఘాటి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఈసారి మరింత జాగ్రత్తగా, సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పుడీ కొత్త ప్రాజెక్ట్ పూర్తిగా అడ్వెంచర్ జానర్లో ఉండబోతుందని టాక్. ముఖ్యంగా ట్రెక్కింగ్ నేపథ్యంలో సాగే కథగా దీన్ని మలుస్తున్నారట. ప్రకృతి అందాలు, సర్వైవల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా అన్నీ కలిసి సినిమా రూపొందనుందని తెలుస్తోంది. సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఉండేలా కథను సిద్ధం చేస్తున్నారట క్రిష్. ఈ చిత్రంలో ఏకంగా ఏడుగురు హీరోయిన్లు ఉండటం మరో ఆసక్తికర అంశంగా మారింది. ఒక్కో పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉండేలా స్క్రిప్ట్‌ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన క్యాస్టింగ్ ప్రాసెస్ జోరుగా సాగుతోందని, పలు భాషల నుంచి నటీమణులను ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. లొకేషన్లు, టెక్నికల్ టీమ్, కాస్ట్ ఫైనలైజేషన్ వంటి పనులు పూర్తయ్యాక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశముంది. కథలో కొత్తదనం, విజువల్ గ్రాండియర్ ఉండేలా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొత్తానికి ‘ఘాటి’ ఫలితం తర్వాత మరోసారి సాహసోపేతమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో క్రిష్ అడుగులు వేస్తున్నాడని స్పష్టమవుతోంది. నిజంగానే ఈ అడ్వెంచర్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుని తెరపైకి వస్తే టాలీవుడ్లో ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌గా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

